Leopard Attacks on Vehicle in Assam: అభయారణ్యాల్లో ఉండాల్సిన పులులు అడవులు దాటుకుని కాంక్రిట్ జంగిల్స్‌లో కాలుపెడుతుండటం తరచుగా చూస్తున్నదే. ఇటీవల కాలంలో ఈ ఘటనలు మరీ ఎక్కువయ్యాయి. అడవులు దాటుకుని జనావాసాల్లోకి ప్రవేశించిన కృూరమృగాలు కనిపించిన వారిపై దాడికి పాల్పడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అడవులను నరికేసి మనిషి అడవుల్లోకి ప్రవేశిస్తుండటంతో వణ్యమృగాలకు ఉండటానికి తావు లేక అడవులు దాటి జనావాసాల్లోకి ప్రవేశిస్తుండటమే ఇలాంటి ఘటనలకు కారణం అనే బలమైన వాదన వినిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా అస్సాంలోని జోరట్‌లోనూ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. జోరట్‌లో జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుత పులి 13 మందిపై దాడి చేసి గాయపర్చింది. అందులో ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. చిరుత పులి దాడిలో గాయపడిన వాళ్లందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తుగా అందరికి సకాలంలో వైద్యం అందడంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. 


జోరట్‌లో ఫెన్సింగ్‌పై నుంచి దూకిన ఒక చిరుత పులి.. రోడ్డుపై నుంచి వెళ్తున్న ఒక వాహనంపైకి దూకింది. ఆ సమయంలో లక్కీగా డ్రైవర్ గ్లాసెస్ మూసి ఉండటంతో అతడికి ప్రాణాప్రాయం తప్పింది. లేదంటే చిరుత పులి దూకిన వేగానికి, చిరుత పులి పంజా విసిరిన తీరుకు అతడిని నోట కరుచుకోవడం ఖాయం అని ఆ దృశ్యం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. డిసెంబర్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



 


వాహనంపైకి దూకిన చిరుత పులి నుంచి ఆ వాహనం డ్రైవర్ తప్పించుకోవడం ఒక ఎత్తయితే.. అదే చిరుత పులి మరొక వాహనం కిందపడకుండా తప్పించుకోవడం మరో ఎత్తు. చిరుతపులి వేగంగా వచ్చి వాహనంపై దూకిన సమయంలోనే ఆ వాహనానికి ఎదురుగా మరో వాహనం వచ్చింది. చిరుతపులి టైమింగ్ ఏ మాత్రం అటుఇటైనా ఆ ఎదురుగా వచ్చిన వాహనం కింద పడే ప్రమాదం ఉంది. కానీ అలా జరగలేదు. ఎదురుగా వచ్చిన వాహనంలో ఉన్న వారు షూట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐ సైతం ఈ వీడియోను ట్విటర్ ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంది. 


ఇది కూడా చదవండి : Lockdown in India: ఇండియాలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ? ఇందులో నిజమెంత ? 


ఇది కూడా చదవండి : Men Protested For Brides: నా వధువు ఏమైందంటూ కలెక్టరేట్ ఎదుట 50 మంది ధర్నా


ఇది కూడా చదవండి : Viral Video: బుడ్డోడి చాకచక్యం.. తల్లిని కాపాడిన వీడియో వైరల్.. చూస్తే ఔరా అనాల్సిందే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook