Lion attacks Man in China Zoo: అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏదంటే.. మనకు వెంటనే గుర్తొచ్చే పేరు సింహం. దాని బలం, ధైర్యం ముందు అడవిలో ఏ ఇతర జంతువు నిలబడలేదు. అడవిలో అన్నింటిని కంట్రోల్ చేసేసింహంకు 'అడవి రాజు' అనే బిరుదు ఉంది. అలాంటి సింహాన్ని మనం దూరం నుంచి చూస్తేనే.. వెన్నులో వణుకు పుడుతుంది. మనవైపు చూసిందంటే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాం. కేర్ టేకర్స్ మాత్రమే వాటిని అదుపు చేయగలరు. ఒక్కోసారి వారిపై కూడా అవి దాడి చేస్తాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చూడబోతున్నాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనాలోని ఓ జూలో ఓ సింహం, పులి ఉంటాయి. వాటి ఎన్‌క్లోజర్‌లోకి ఓ కేర్ టేకర్ వెళతాడు. ఓ బుక్ పట్టుకుని వాటికి ఎదో చెబుతుంటాడు. క్లాస్ మాదిరిగా సింహం, పులికి అతడు బోధిస్తుంటాడు. కొన్ని సెకండ్లు ఓపికగా విన్న సింహం.. ఒక్కసారిగా అతడిపై దాడి చేసి బుక్ కింద పడేస్తాయి. అనంతరం ఆ వ్యక్తిపై దాడి చేస్తుంది. ఆయినా కూడా ఆ వ్యక్తి ఎన్‌క్లోజర్‌ నుంచి బయటికి వెళ్ళడు. కాసేపటికి అతడు ప్యాంటు పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తుంది. మరోసారి కూడా దాడి చేయడానికి ప్రయత్నించగా.. తన చేతులతో సింహంను బెదిరిస్తాడు. 



ఇందుకు సంబందించిన వీడియోను డిస్కవరీ ఛానల్ఇండ్ (DiscoveryChannelInd) అనే యూట్యూబ్ ఛానెల్ అప్ లోడ్ చేసింది. ఈ వీడియో 2017లో పోస్ట్ అయినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ సింహం వీడియోకి 13,129,329 వ్యూస్ వచ్చాయి. 'నువ్ తోపులకే తోపు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'నీ ధైర్యానికి పెద్ద సలామ్' అని ఇంకొకరు కామెంట్ చేసారు. 


Also Read: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. హిట్టర్లకు మారుపేరు వెస్టిండీస్‌ను ఓడించిన పసికూన స్కాట్లాండ్‌!


Also Read: పెవిలియన్ వెళ్తుండగా.. బౌండరీ రోప్ వద్ద కిందపడిన బ్యాటర్! నవ్వులు పూయిస్తున్న వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook