Woman easily handled two lions with Stick: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సింహం, చిరుత, జింక, మొసలి, ఏనుగులకు సంబందించినవి జనాలను బాగా ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని నవ్వులు పూయించే వీడియోలు ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వీడియోలో రెండు సింహాలను ఓ మహిళ అలవోకగా అదుపు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడవిలో సింహం అత్యంత ప్రమాదకరమైన జంతువు. సింహం యొక్క బలం మరియు చురుకుదనం దృష్ట్యా దానిని అడవి రాజు అని పిలుస్తుంటారు. ప్రమాదకరమైన సింహం ప్రతిఒక్క జంతువుపై దాడి చేసి తినేస్తుంటుంది. మనుషులను కూడా భయబ్రాంతులకు గురిచేస్తాయి. అలాంటి రెండు సింహాలను ఓ మహిళ.. ఆవులను, గొర్రెలను కాచినట్టు అలవోకగా కాపలా కాస్తుంది. ఒక కర్రతో రెండు సింహాలను అదుపు చేస్తుంది. 



వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ మహిళ అడివి మార్గంలో రెండు సింహాలను అదుపు చేస్తుంది. మహిళ తన చేతిలోని కర్రతో రెండింటిని ఆవులను, గొర్రెలను కాచినట్టుగా దారిగుండా తీసుకెళుతుంది. అవి రెండు కూడా నిదానంగా ముందుకు నడుస్తున్నాయి. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియోను పృతాశెట్టి అనే ఇన్‌స్టాగ్రామ్ యూసర్ షేర్ చేసింది. ఏ వీడియోకి కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇవి పెంపుడు సింహాలు అని ఒకరు కామెంట్ చేయగా.. మహిళ ముందు సింహం కూడా పిల్లి అవుతుంది అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 


Also Read: Samantha Ruthprabhu: సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ఆ నేత ఫోటో షేర్ చేయడంతో!


Also Read: IND vs ENG: దంచికొట్టిన బెయిర్‌స్టో, రూట్.. ఇంగ్లండ్ ఘన విజయం! భారత్ ఆశలు ఆవిరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook