Viral Video of Son Saving his Mother: రవ్వంత పిల్లలయినా సరే కష్టమొస్తే తల్లికి కొండంత ఆసరా అవుతారని పెద్ద వాళ్లు చెబుతుంటుంటే వింటుంటాం. అది నిజమని నిరూపించే వీడియో ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. ఒక మహిళ తన ఇంటి ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గుమ్మంపై భాగంలో ఏదో మరమ్మత్తులు చేస్తుండగా ఉన్నట్టుండి తాను నిలబడిన నిచ్చెన కిందపడింది. అప్పటి వరకు నిచ్చెన సహాయంతో గుమ్మం ద్వారం పట్టుకుని నిలబడిన ఆ మహిళ ఉన్నట్టుండి నిచ్చెన కిందపడటంతో కాళ్ల కింద పట్టు కోల్పోయింది. గుమ్మం పట్టుకుని గాల్లో వేళ్లాడుతూనే సహాయం కోసం కేకలు వేయడం మొదలుపెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళ ఆపదలో పడిన సమయంలో చిన్న పిల్లాడు అయిన ఆమె కుమారుడు అక్కడే ఉన్నాడు. బుడి బుడి అడుగులు వేసే చిరుప్రాయంలో తల్లి గాల్లో వేళ్లాడటం, కేకలు వేయడం చూసి మొదట ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాడు. కానీ తన తల్లి కేకలు విని క్షణాల్లోనే పరిస్థితిని అర్థం చేసుకుని అంత చిన్నవయ్ససులోనూ తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు. వెంటనే నిచ్చెన పడిపోయిన వైపునకు పరిగెత్తాడు. బుడ్డోడేమో నిండా మూడడుగులు లేడు. నిచ్చెన మాత్రం తనకంటే మూడురెట్లు పెద్దగా ఉంది. అయినా సరే అతి కష్టం మీద ఆ నిచ్చెనను ఎత్తే ప్రయత్నం చేశాడు. తన శక్తికి మించి బరువు, ఎత్తు ఉన్న ఆ నిచ్చెనను అతి కష్టం మీద ఎత్తి నిలబెట్టి తన తల్లి వద్దకు జరిపాడు. 



 


తన కొడుకు అతి కష్టం మీద ఎత్తి నిలబెట్టిన నిచ్చెన కాళ్ల కిందకు రావడంతోనే దానిని అందిపుచ్చుకుని తనకు అనువుగా మార్చుకుందామె. ఆ తరువాత సురక్షితంగా కిందకు దిగింది. చిన్న పిల్లాడే అయినప్పటికీ.. యుద్ధ ప్రాతిపదికన అతడు స్పందించిన తీరు చూసి అందరూ అవాక్కయ్యారు. దిపాన్షు కబ్రా అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. చిన్న పిల్లాడే అయినా.. తెలివిగా తల్లికి సహాయపడ్డాడంటూ పిల్లాడిని అభినందించని నెటిజెన్స్ లేరు. ఈ వీడియో చూసిన వాళ్లంతా పిల్లాడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.


ఇది కూడా చదవండి : 1000 Notes Coming Back: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా ? 2 వేల నోట్లు బ్యాన్ ? ఏది నిజం ?


ఇది కూడా చదవండి : Cockroach Found in Omelette: రైల్లో ఆహారం తింటున్నారా ? ఆమ్లెట్‌లో బొద్దింకపై ప్రధానికి ఫిర్యాదు


ఇది కూడా చదవండి : Bride and groom fighting: పెళ్లి మండపంలోనే జుట్టుపట్టుకొని పిచ్చకొట్టుడు కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook