Cockroach Found in Omelette: రైల్లో ఆహారం తింటున్నారా ? ఆమ్లెట్‌లో బొద్దింకపై ప్రధానికి ఫిర్యాదు

Cockroach Found in Omelette: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై మధ్య రాకపోకలు సాగించే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో డిసెంబర్ 16న ఈ ఘటన చోటుచేసుకుంది. యోగేష్ మోరే అనే రైలు ప్రయాణికుడు రైల్లో ప్రయాణించే సమయంలో తన రెండున్నరేళ్ల చిన్నారి కోసం ఎక్స్‌ట్రా ఆమ్లెట్ ఆర్డర్ చేశారు.

Written by - Pavan | Last Updated : Dec 17, 2022, 09:23 PM IST
Cockroach Found in Omelette: రైల్లో ఆహారం తింటున్నారా ? ఆమ్లెట్‌లో బొద్దింకపై ప్రధానికి ఫిర్యాదు

Cockroach Found in Omelette: రైళ్లలో ఆహారంలో పురుగులు, బొద్దింకలు లాంటి కీటకాలు వచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో చూశాం. ఒక్కోసారి బల్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. తన రెండున్నరేళ్ల చిన్నారి కోసం ఒక రైల్వే ప్రయాణికుడు ఎక్స్‌ట్రా ఆమ్లెట్ ఆర్డర్ చేశారు. ఆ ఎక్స్‌ట్రా ఆమ్లెట్ ప్యాక్ విప్పి చూడగా.. ఆమ్లెట్ మడతల మధ్య బొద్దింక కనిపించింది. దీంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి ఈ విషయాన్ని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రైల్వే శాఖ మాజీ మంత్రి పీయుష్ గోయల్, రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్తూ ట్విటర్ ద్వారా పబ్లిగ్గానే ఫిర్యాదు చేశారు. ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సిటిసిని మరోసారి తీవ్ర విమర్శల పాలయ్యేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై మధ్య రాకపోకలు సాగించే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో డిసెంబర్ 16న ఈ ఘటన చోటుచేసుకుంది. యోగేష్ మోరే అనే రైలు ప్రయాణికుడు రైల్లో ప్రయాణించే సమయంలో తన రెండున్నరేళ్ల చిన్నారి కోసం ఎక్స్‌ట్రా ఆమ్లెట్ ఆర్డర్ చేశారు. ఆ ఆమ్లెట్లో పొట్లం విప్పి చూడగా అందులో బొద్దింక కనిపించడం చూసి తీవ్ర ఆందోళనకు గురైన యోగేష్.. ఒకవేళ తన కూతురు ఆ ఆమ్లెట్ తిని ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తూ ట్విటర్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు. తన ట్వీట్‌లో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మాజీ మంత్రి పీయుష్ గోయల్, పీయుష్ గోయల్ కార్యాలయం, రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ.. బొద్దింక ఉన్న ఈ ఆమ్లెట్ తిని తన కూతురికి ఏమైనా జరిగి ఉంటే.. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. 

యోగేష్ మోరే చేసిన ఈ ట్వీట్ ఇండియన్ రైల్వేస్‌ని తీవ్ర విమర్శల పాలయ్యేలా చేసింది. నాణ్యమైన ఆహారం అందించడంలో ఐఆర్‌సిటిసి విఫలం అవుతోందని రైల్వే ప్రయాణికులతో పాటు నెటిజెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

రైళ్లలో నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలం అయితే ఆర్థికంగా ఆ నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఒక ట్విటర్ యూజర్ డిమాండ్ చేశారు. ఒకవేళ తాను రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించి.. రైల్వే శాఖకు ఆర్థికంగా జరిగిన నష్టానికి చింతిస్తున్నాను అని క్షమాపణలు చెబితే ఊరుకుంటారా అని ఎదురు ప్రశ్నించారు. ఇదిలావుంటే, ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ ఉండగా.. యోగేష్ పొరపాటున రైల్వే శాఖకు మాజీ మంత్రి పీయుష్ గోయల్‌ని ట్యాగ్ చేసినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Who is Rohit Sharma's wife: రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఎవరో తెలుసా ?

ఇది కూడా చదవండి : Bride and groom fighting: పెళ్లి మండపంలోనే జుట్టుపట్టుకొని పిచ్చకొట్టుడు కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Vahan Puja For Helicopter: యాదాద్రిలో అరుదైన దృశ్యం.. హెలీక్యాప్టర్‌కి వాహన పూజలు, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News