Woman Wearing Lehanga In London: ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా..  ఎలాంటి వింత ఘటనలైన సెకన్లలో వైరల్ గా మారుతుంటాయి. నార్మల్ గా చాలా మంది తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. కానీ వారికి సరైన ప్లాట్ ఫామ్ దొరక్క బాధపడతారు. అలాంటి వారికి సోషల్ మీడియా ఒక గిఫ్ట్ లాంటిదని చెప్పుకొవచ్చు. వారి ట్యాలెంట్ ను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొవచ్చు. ఇది నచ్చితే వెంటనే నెటిజన్లు మరల వైరల్ చేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



దీంతో ఓవర్ నైట్ లో వారికి కలలో కూడా ఊహించని ఫెమ్ వచ్చి పడుతుంది. దీంతో రాత్రికి రాత్రే స్టార్ లు కూడా అయిపోతుంటారు. ముఖ్యంగా.. సోషల్ మీడియాలో ఫన్నీ ఘటనలు, పెళ్లికి సంబంధించిన వెరైటీ వీడియోలు, డ్యాన్స్ రీల్స్ లు తరచుగా వైరల్ అవుతుంటాయి. చాలా మంది ట్యాలెంట్ ఉన్నవాళ్లు, తమ స్పెషాలిటి చూపించాలనుకునే వారు ప్రస్తుతం సోషల్ మీడియాలో భలే యాక్టివ్ గా ఉంటున్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది. ఈ వీడియోలో యువతి లండన్ లో భారత పెళ్లి కూతురు కాస్ట్యూమ్ ధరించి ట్రైన్ లో, అక్కడి ప్రాంతంలో తిరుగుతూ అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. 


ఈ వీడియోను శ్రద్ధ అనే ఇన్ స్టా  అకౌంట్ లో పోస్ట్ చేయబడింది. దీనిలో యువతి అచ్చం పెళ్లి కూతురులా కాస్ట్యూమ్ వేసుకుంది.  శ్రధ్ద అనే యువతి భారత, స్పానిష్ మోడల్. ఇంకా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1,68,000 మంది ఫాలోవర్లు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రద్ధ.. డిజిటల్ మార్కెట్ ప్రమోటర్,  వైరల్ మీడియా క్రియేటర్ అంట. ఈ వీడియోలో  యువతి.. రెడ్ కలర్ లెహంగా వేసుకుని లండన్ లోని మెట్రో స్టేషన్ లో హల్చల్ చేసింది. అంతే కాకుండా.. ఆమె ట్రైన్ లో ఎక్కి ప్రయాణిస్తుంటే, అక్కడి వారు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.


Read More: Rakul Preet Singh: రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ రిస్కీ పాత్రకి సిద్ధమైపోయిన హీరోయిన్


అంతే కాకుండా.. మరికొందరు వావ్.. గార్జియస్ అంటూ కూడా ఆమెతో అంటున్నారు. అస్సలు మరికొందరైతే.. లండన్ మహిళలు కూడా ఆమెను చూస్తు ఉండిపోయారు. ఫిబ్రవరి ఒకటో తేదిన ఈ వీడియో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రీల్ 2,732,494 లైక్‌లను,  42 మిలియన్ల కంటే ఎక్కువ మంది చూసినట్లు తెలుస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు తమ దైన స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు. కొందరు భారత దేశం గొప్పతనం ఇది.. తల ఎత్తుకుని చూస్తుండాలి.. అని కొందరు, మరికొందరు మాత్రం.. పెళ్లి నుంచి పారిపోయి వచ్చిందా ఏంటీ..? అని.., భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా కాస్ట్యూమ్ ఉందంటూ ఇంకొందరు కామెంట్ లు చేస్తున్నారు.