Stag Beetle: పురుగులు అని నీచంగా తీసి పారేయకండి. వేరే దేశాల్లో పురుగులు బంగారంగా భావిస్తారు. లక్షలు వెచ్చించి మరి పురుగులను కొనుగోలు చేస్తారు. అంతటి విలువైన ఖరీదైన పురుగులు చాలా ఉన్నాయి. వాటిలో స్టాగ్‌ బీటిల్‌  అనే పురుగు చాలా చాలా ఖరీదైనది. దాని ధర ఏకంగా దాదాపు కోటి ఉంటుంది. స్టాగ్‌ బీటిల్‌ పురుగును అదృష్టానికి సూచికగా భావిస్తారు. బ్రిటన్‌లో ఈ పురుగుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిశాయి. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Letter To KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు యువతి లేఖ.. ఏం రాసిందో తెలుసా?


పురుగు పేరు: స్టాగ్‌ బీటిల్‌
బరువు: 2-6 గ్రాములు
జీవితకాలం: 3-7 సంవత్సరాలు
పొడవు: మగ పురుగులు 35-70 మిల్లీమీటర్ల పొడవు, ఆడ పురుగులు 30-50 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి.
జీవన విధానం: చెక్కలపై ఆధారపడి స్టాగ్‌ బీటిల్‌ జీవిస్తుంది.
ఆకారం: అచ్చం ఎండ్రకాయ మాదిరి ఉంటాయి.
ఆహారం: చెట్ల నుంచి సాప్‌ అనే ద్రవాన్ని, కుళ్లిన పండ్ల నుంచి కారే తీపి స్రావాలను సేవిస్తాయి.

Also Read: Third Marriage: అదృష్టమంటే పండన్నదే.. భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఇద్దరు భార్యలు


లండన్‌కు చెందిన నేచరల్‌ హిస్టరీ మ్యూజియం స్టాగ్‌ బీటిల్‌ పురుగుకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ పురుగు అటవీ పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. ఈ పురుగులకు కొండీలు ఉండడంతో.. మగ జింకల మాదిరి కొమ్ములు ఉండడంతో స్టాగ్‌ బీటిల్స్‌ అని పేరు పెట్టారు. కొండీల ద్వారా స్టాగ్‌ బీటిల్స్‌ సంతానోత్పత్తి చేపడతాయి. ఆడ పురుగులతో జత కట్టేందుకు కొండీలు సహాయపడతాయి. ఆ సమయంలో విచిత్రమైన శబ్ధాలు చేస్తాయి.


స్టాగ్‌ బీటిల్స్‌ అనే పురుగులు మొక్కలను నాశనం చేయవు. కలపను పదునైన దవడలతో చీల్చి తింటాయి. కానీ పచ్చటి మొక్కల జోలికి మాత్రం వెళ్లవు. కేవలం చనిపోయిన (మృత) వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఫలితంగా అటవీ ప్రాంతంలో వృక్ష సంపదకు ఎలాంటి నష్టం వాటిల్లదు. అంతే కాదు ఈ పురుగులను ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తుండడం విశేషం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter