Madhya Pradesh Deputy Collector Resigns: తన సొంత ఇంటి ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వకపోవడంతో మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా డిప్యూటీ కలెక్టర్ రాజీనామా చేశారు. ఛతర్‌పూర్ జిల్లాలోని లవకుష్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌ నిషా బాంగ్రే రాజీనామా లేఖ ప్రస్తుతం నెటింట వైరల్ అవుతోంది. లవకుష్ నగర్ ఎస్‌డిఎమ్‌గా నియమితులైన నిషా బాంగ్రే.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తన మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని  లేఖలో ఆరోపించారు. తన ఇళ్లు ప్రారంభోత్సవంతోపాటు తన ఇంట్లో నిర్వహించే మతపరమైన ఆచారానికి హాజరయ్యేందుకు సాధారణ పరిపాలన శాఖ అనుమతి నిరాకరించలేదని.. అందుకే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మా ఇంటి ప్రారంభోత్సవానికి హాజరుకాకుండా చేసేందుకు నాకు సెలవు ఇవ్వలేదు. మా ఇంట్లో నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా నిరోధించడం మతపరమైన మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. నేను ఎదుర్కొన్న నష్టం పూడ్చలేనిది. నా ప్రాథమిక హక్కులు, మత విశ్వాసం, రాజ్యాంగ విలువలతో రాజీ పడటం నాకు సాధ్యం కాదు. పదవిలో కొనసాగడం నాకు ఇష్టం లేదు. నేను ఈరోజు జూన్ 22, 2023న డిప్యూటీ కలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నాను' అని నిషా బాంగ్రే తెలిపారు. ఆమె రాజీనామా లేఖను పాత్రికేయుడు కాషిఫ్ కక్వీ ట్వీట్ చేశారు.


 




ఈ నెల 25న బేతుల్ జిల్లాలోని ఆమ్లాలో నిషా బాంగ్రే తన కొత్త ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అదేరోజు సర్వమత శాంతి సదస్సులో పాల్గొనాలని ఆమె అనుకుంది. ఇందుకోసం సెలవ కోరగా.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సాధారణ పరిపాలన శాఖ ఆమెను అనుమతి నిరాకరించింది. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ ఆమె భర్త వ్యవహరిస్తున్నారు. తన ఇళ్లు ప్రారంభోత్సవంతోపాటు ప్రపంచ శాంతి దూత అయిన తథాగత్ బుద్ధుని చితాభస్మాన్ని చూసేందుకు వెళ్లాలని నిషా బాంగ్రే అనుకుంది. ఇందుకు సెలవు మంజూరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిషా బాంగ్రే.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. 


నిషా బాంగ్రే చాలా కాలంగా సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఆమ్లా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రజలు కోరుకుంటే.. ఎన్నికల్లో పోటీపై తాను ఆలోచిస్తానని నిషా బాంగ్రే గతంలో స్వయంగా చెప్పారు. అయితే ఆమె రాజీనామాను ప్రస్తుతం రాజీనామాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించలేదు.


Also Read: Titanic Submarine: చివరికి విషాదాంతం.. టైటాన్ సబ్‌మెరైన్‌లో ఐదుగురు మృతి   


Also Read: Underwater Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్‌లో అండర్ వాటర్ మెట్రో..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook