Hanuman idol binked Eyes: మధ్యప్రదేశ్​లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. హనుమంతుడు (Lord Hanuman) కళ్లు ఆర్పడం కెమెరా కంట పడింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలోని బద్వాహ్ సమీపంలోని ఓఖ్లా గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఓఖ్లేశ్వర్ ధామ్ హనుమాన్ దేవాలయం (Akhleshwar dham hanuman mandir) ఒకటి. ఇది ఖర్గోన్ జిల్లాలో ఉంది. ఇది పురాతన ఆలయం. శనివారం గుడిలో దేవుడిని అలంకరిస్తుండగా హనుమంతుడి కళ్లు ఆర్పిన ఘటన కెమెరాకు చికినట్లు తెలుస్తోంది. దీనిని  కొంత మంది తమ మెుబైల్ ఫోన్లలో చిత్రీకరించినట్లు సమాచారం. ఈ న్యూస్ కాస్తా వైరల్ (Viral) గా మారడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇది నిజంగా అద్భుతమని ఆలయ పూజారి చెబుతున్నారు. ఇక్కడ ఇలాంటి అద్భుతాలు ఇంతకముందు కూడా జరిగాయని స్థానికులు అంటున్నారు.  



ఓఖ్లేశ్వర్ ధామ్‌లో హనుమాన్ జయంతితో సహా సంవత్సరంలో 13 సార్లు ఆంజనేయుడిని అలంకరిస్తారు. ప్రతినెలా 27వ తేదీన రోహిణి నక్షత్రంలో హనుమంతుడికి ఈ విధంగా చేస్తారు. ఈయనను దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ వైరల్ వీడియోను జీ న్యూస్ ధృవీకరించలేదు.


Also Read: King Cobra Snake: నీ ధైర్యానికి దండం సామీ..! 20 అడుగుల కింగ్ కోబ్రా అటాక్ చేస్తే ఎలా అదుపు చేసాడో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


.