Leopard Enters Office In Nashik Maharashtra: కొన్నిసార్లు మనం కలలో కూడా ఊహించని ఘటనలు జరిగిపోతుంటాయి. ఇలాంటి సమయంలోనే మనం ఎలా రెస్సాండ్ అవుతామో అనేదానిపై మన ధైర్యం, ఆలోచన విధానం ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. కొన్నిసార్లు ఇంట్లో ఉండగా... పాములు, కోతులు, ఇతర హనీకార కీటకాలు ఇంట్లో ప్రవేశిస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొందరు అరిచి గగ్గొలు పెడుతుంటారు. ఇల్లు టాప్ లేచిపోయేలా అరుస్తుంటారు.  వీరి అరుపులతో చుట్టుపక్కల ఉన్న వారు పరుగెత్తుకుంటూ వస్తారు. కానీ మరికొందరు మాత్రం ఇలాంటి సిట్యూవేషన్ లలో టెన్షన్ పడకుండా.. చాకచక్యంగా ఇంట్లో వారిని అలర్ట్ చేస్తారు. ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయిన బుర్రపెట్టి ఆలోచిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అడవికి దగ్గరలో ఉన్న ఇళ్లలో తరచుగా పాములు, కోతులు, చిరుతపులులు, ఎలుగు బంట్లు, ఏనుగులు రావడం వంటివి జరుగుతుంటుంది. ఇలాంటి ఎన్నో ఘటనలు మనం సోషల్ మీడియాలో చూశాం. రాత్రిపూట చిరుతపులులు ఇంట్లోకి  ప్రవేశించి, పెంపుడు కుక్కలపై దాడిచేసిన వీడియోలు కూడా గతంలో అనేకం వైరల్ గా మారాయి.తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.


పూర్తి వివరాలు...


మహరాష్ట్రలోని నాసిక్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మాలెగావ్ పట్టణంలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. మాలెగావ్ కు చెందిన 12 ఏళ్ల బాలుడు మోహిత్ ఆఫీస్ లో మెయిన్ డోర్ పక్కన సోఫాలో కూర్చుని మొబైల్ ఫోన్ లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించింది. అది బాలుడిని గమనించకుండానే నేరుగా గదిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బాలుడు చాకచక్యంగా వ్యవహరించాడు. మెల్లగా చిరుతపులి అటు గదిలో వెళ్లిపోగానే.. కూల్ గా లేచి డోర్ కు లాక్ వేసి తల్లిదండ్రులను అలర్ట్ చేశాడు.


Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..


వెంటనే వారంతా అక్కడికి చేరుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయ్యింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాలుడి ధైర్యానికి శభాష్... అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. బాలుడు పొరపాటున భయపడి గట్టిగా అరిచి ఉంటే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇంకొందరు.. మాత్రం బాలుడికి తల్లిదండ్రలు భలే..  చాకచక్యంగా వ్యవహరించాడంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook