Maharashtra Girl Death Car Viral Video: కొందరు యువత రీల్స్ పిచ్చిలో ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఎలాగైన ఫేమస్ కావాలని వింత వింత వేషాలు వేస్తున్నారు. కొందరు బైక్ ల మీద రొమాన్స్ చేస్తు రీల్స్ చేస్తున్నారు. మెట్రోలో, ఎయిర్ పోర్టులో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నచ్చిన విధంగా రీల్స్ చేస్తు రచ్చ చేస్తున్నారు. వీళ్ల రీల్స్ పిచ్చి వల్ల చాలాసార్లు చుట్టుపక్కల వారు ఇబ్బందులకు గురౌతున్నారు. ఇటీవల మెట్రోలో రోమాన్స్ చేసుకుంటూ అమ్మాయిలు రీల్స్ చేయడం రచ్చగా మారింది. మరోవైపు లవర్స్‌ లు బైకుల మీద కూర్చుని డెంజరస్ స్టంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా.. కొండలు, జలపాతాలు, నదులు, అడవులల్లో డేంజరస్ స్టంట్లు చేస్తు రీల్స్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




ఇక మరికొందరైతే.. క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి రీల్స్ , వీడియోలు తీయడానికి ట్రైచేసి డెంజర్ లో పడిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. చాలాసార్లు యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడాఉన్నాయి. తాజాగా, మహరాష్ట్రలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతికారులో కూర్చుని రీల్ చేయడానికి ప్రయత్నించింది. ఇది కాస్త తీవ్ర విషాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) గా మారింది.


పూర్తి వివరాలు..


మహరాష్ట్రలోని ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఉన్న దత్ ధామ్ టెంపుల్ కొండపై ఘోరం జరిగింది. 23 ఏళ్ల శ్వేత సుర్వాసే.. డ్రైవింగ్ రాకపోయిన కారునడిపేందుకు ప్రయత్నించింది. బయట ఉన్న ఆమె స్నేహితుడు శివరాజ్ అనే వ్యక్తి ఆమె కారు నడుపుతుండగా రీల్‌ రికార్డు చేస్తున్నాడు. ఆ ప్రదేశం చాలా ఎత్తులో ఉంది. పక్కనే ప్రమాదకరమైన లోయ కూడా ఉంది. ఇంతలో సదరు యువతి.. కారుస్టార్ట్ చేసి.. బ్రేక్ కు బదులుగా బలంగా ఎక్స్ లేటర్ ను నొక్కింది.


ఈ నేపథ్యంలో కారు సెకన్ల వ్యవధిలో.. వెనక్కు వెళ్లిపోయి లోయలో పడిపోయింది. ఆ వీడియోలో సదరు యువకుడు.. కారు బ్రేక్ వేయాలని అరుస్తున్న వాయిస్ రికార్డు అయ్యింది. యువతి కారుతో సహా 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ క్రమంలో.. కిందకు వెళ్లి చూడగా కారు పూర్తిగా ధ్వంసమైపోయింది.


ఈ ప్రమాదంలో యువతి ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన తీవ్రకలకలంగా మారింది. చుట్టుపక్కల ఉన్న వారు ఘటన స్థలానిక పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే యువతి చనిపోయినట్లు గుర్తించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు.. ఇలాంటి చోటకు వెళ్లినప్పుడు రీల్స్ అవసరమా.., అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు కారు నడపరాని వాళ్లకు, అలాంటి ప్రదేశంలో ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రీల్స్ మోజులో పడి ఒక నిండు ప్రాణం పోయింది కదా.. అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Read more: Pawan Kalyan Security: Y ప్లస్‌ ఎస్కార్ట్ , బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్  గ్రాండ్ ఎంట్రీ.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి