man bike ride stunt into the crocodile lake video goes viral: సోషల్ మీడియాలో కొందరు ఫెమస్ అవ్వడం కోసం ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఓవర్ నైట్ లో ఫెమస్ అవ్వడానికి వింత వింత స్టంట్ లు సైతం చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పడేసుకుంటున్నారు. కొందరు కొండలు, జలపాతాలు, అడవులు మొదలైన చోట్ల ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. రీల్స్ లు, వీడియోలో పిచ్చిలో అవసరంలేని రిస్క్ లు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొంత మంది ఎత్తైన ప్రదేశాలలో వెళ్లి.. స్టంట్ లు చేస్తున్నారు. మరికొందరు అడవిలోని జంతువుల దగ్గరకు వెళ్లి వెరైటీగా ప్రవర్తిస్తుంటారు. దీంతో కొన్నిసార్లు అవి దాడులు చేసిన ఘటనలు కూడా అనేకం వార్తలలో నిలిచాయి. ఓవర్ నైట్ లో ఫెమస్ కావడానికి లేని పోనీ వేశాలు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియో ప్రస్తుంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా లో  జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.  సిలిసెహర్ మొసళ్ల పార్క్‌లో ఒక వ్యక్తి బైక్ తో విన్యాసాలు చేశారు. ఏకంగా  300 మొసళ్లు ఉన్న ఓ సరస్సులో దూసుకుపోయి ప్రమాదకర విన్యాసాలు చేశాడు. ఆసరస్సులో దాదాపు 300 కి పైగా మొసళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి వాళ్లు కనీసం.. సరస్సు దగ్గరకు వెళ్లడానికి సైతం సాహాసం చేయరు. కానీ వీరు మాత్రం బైక్ లు, జీప్ లతో విన్యాసాలు చేయడం మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.


Read more: TGRTC Free bus: అట్లుంటదీ మన్ తోనీ.. బస్సులో వెల్లుల్లీ పొట్టు తీసుకుంటూ జర్నీచేస్తున్న మహిళ.. వీడియో వైరల్..


కొంత మంది  యువత.. బైక్ లు, కార్లతో సరస్సులో వేగంగా వెళ్లి మొసళ్లకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించారు. దీంతో సరస్సులోని మొసళ్లు బైక్ లు, కార్ల  శబ్దానికి దూరంగా వెళ్లిపోయాయి. దీనిపై వన్యప్రాణిసెఫ్టీ అధికారులు స్పందించారు. వీరిని కఠినంగా పనిష్మెంట్ చేయాలనికూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పొరపాటున ఆ బైక్.. సరస్సు మధ్యలో ఆగిపోతే అతని పరిస్థితి ఏంటని కూడా నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పనులు మానుకోవాలంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి