Viral Video: వామ్మో.. దిండు కింద ప్రపంచంలోనే అత్యంత విషసర్పం.... షాకింగ్ వీడియో వైరల్..
Snake Video: సౌత్ ఆఫ్రికాలోని ఒక ఇంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంచం నుంచి ఏవేవో శబ్దాలు వస్తుండంటంతో ఇంట్లో వాళ్లు మెల్లగా దగ్గరకు వెళ్లిచూశారు . అప్పుడు ఒక పాము తోక వాళ్లకు కన్పించింది. ఇంకా ఆలస్యం చేయకుండా.. వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చారు.
Snake viral incident goes viral: సాధారణంగా పాములు చలికాలంలో ముఖ్యంగాషూస్ లు, బట్టలు, ఇంట్లో వెచ్చగా ఉండు ప్రదేశాలకు వస్తుంటాయి. అదే విధంగా పాములు కొన్నిసార్లు ఎలుకల కోసం మన ఇళ్లలోనికి వస్తుంటాయి. అడవులు, చెట్లు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో పాములు కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అదే విధంగా పాములు కొన్నిసార్లు మన ఇళ్లలోకి వస్తుంటాయి.
పాముల వీడియోలు నిత్యం సోషల్ మీడియాలలో వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తేనే భయంగా అన్పిస్తుంది. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేసేవిలా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో పాములు కన్పిస్తే కొంత మంది స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు పాముల్ని చంపుతుంటారు. అయితే.. పాముల వీడియోలు చూసేందుకు నెటిజన్లు పడిచస్తుంటారు.
సౌత్ ఆఫ్రికాలోని స్టెల్లెన్ బోష్ పట్టణంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంట్లో బెడ్ నుంచి ఏదో హిస్.. హిస్ .. అని శబ్దాలు వస్తుండటంతో దిండు దగ్గరకు వెళ్లి చూశారు. అప్పుడు పాము తోక కన్పించింది. వెంటనే వాళ్లు పాముల్ని పట్టే వాళ్లకు సమాచారం ఇచ్చారు.
వెంటనే స్నేక్ మెన్ అక్కడికి చేరుకుని దిండు కింద నక్కిన పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ పాము సౌత్ కొరియాలోనే అత్యంత విషపూరితమైన సర్పంగా అక్కడి వాళ్లు చెప్తున్నారు. మరీ ఆ పాము అక్కడికి ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతున్నారు. స్నేక్ మెన్ దాన్ని పట్టుకుని, ఒక బాక్స్ లో నీట్ గా బంధించి,అడవిలో వదిలిపెట్టినట్లు తెలుస్తొంది.
Read more: Viral Video: ఓర్ని.. వీడేంట్రా నాయన.. బెడ్ మీద అనకొండతో రోమాన్స్..?.. షాకింగ్ వీడియో వైరల్..
ఈ పాము కాటు వేస్తే.. సెకన్ ల వ్యవధిలో నాడీ వ్యవస్థ, మెదడుపై ప్రభావం చూపిస్తుందని కూడా అక్కడివారు చెబుతున్నాు. మొత్తానికి పామును పట్టుకొవడంతో ఆ ఇంటి వాళ్లు హమ్మయ్య.. అనుకుంటున్నారంట. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.