Man jumps into lion enclosure: సింహం నోట్లో తల పెట్టడం అంటే ఇదే.. Viral video
Man jumps into lion enclosure for diamonds: ఒక మనిషి చావుకి తెగించి మరీ ఒక సాహాసోపేతమైన పిచ్చి పని చేస్తే.. దానిని సింహం నోట్లో తలపెట్టడం అంటారు. ఎందుకంటే సింహం నోట్లో తలపెడితే అది తినకుండా విడిచిపెట్టదని తెలిసి కూడా అలాంటి సాహసం చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆ మాట అంటారు. కానీ ఇదిగో ఇక్కడ ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి మాత్రం నిజంగానే సింహం నోట్లో తలపెట్టినంత పనిచేశాడు.
Man jumps into lion enclosure for diamonds: ఒక మనిషి చావుకి తెగించి మరీ ఒక సాహాసోపేతమైన పిచ్చి పని చేస్తే.. దానిని సింహం నోట్లో తలపెట్టడం అంటారు. ఎందుకంటే సింహం నోట్లో తలపెడితే అది తినకుండా విడిచిపెట్టదని తెలిసి కూడా అలాంటి సాహసం చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆ మాట అంటారు. కానీ ఇదిగో ఇక్కడ ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి మాత్రం నిజంగానే సింహం నోట్లో తలపెట్టినంత పనిచేశాడు.
హైదరాబాద్‌లోని జూ పార్కులో (Hyderabad Zoo park) సింహాలు ఉండే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సాయి కుమార్.. అక్కడే కాసేపు రాళ్లపై కూర్చుని అక్కడ ఉన్న వాళ్లందరినీ టెన్షన్‌కి గురిచేశాడు. ఆఫ్రికన్ సింహానికి దాదాపు మూడ్నాలుగు మీటర్లలోపే రాయిపై కూర్చుని సింహాన్ని రెచ్చగొడుతూ అందరినీ ఉత్కంఠకు గురిచేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read : Free Biryani For Tomatoes: బిర్యానీ లవర్స్ కు గుడ్ న్యూస్.. కేజీ టమాటాలకు బిర్యానీ ఉచితం
జూ పార్కులో సింహాల ఎన్‌క్లోజర్ వద్ద అరుపులు విన్న జూ సిబ్బంది ఏం జరుగుతుందా అని అక్కడికి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతి కష్టం మీద సాయి కుమార్‌ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చిన సిబ్బంది.. అనంతరం సాయి కుమార్‌పై బహదూర్‌పుర పోలీసులకు (Hyderabad police) ఫిర్యాదు చేస్తూ అతడిని వారికి పట్టించారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం పోలీసులు సాయి కుమార్‌ని విచారించగా.. అతడి మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదని తెలిసింది. సింహాల ఎన్‌క్లోజర్‌లోకి (Lions enclosure) వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని సాయి కుమార్‌ని ప్రశ్నించగా... అక్కడ వజ్రాలు దాగి ఉన్నాయని, అవి తీసుకోవడానికే అక్కడికి వెళ్లాలనని సాయి కుమార్ చెప్పడం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. దీంతో సాయి కుమార్ మానసిక పరిస్థితి (Mental condition) సరిగ్గా లేనట్టు అనిపిస్తోందని అనుమానిస్తున్న పోలీసులు.. అతడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also read : Chickens Killed Due To DJ Music: డీజే మ్యూజిక్ కు 63 కోళ్లు బలి.. పోలీసులను ఆశ్రయించిన కోళ్ల ఫామ్ యజమాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook