Chickens Killed Due To DJ Music: ఒడిశాలోని బాలాసోర్ లో ఓ వింత ఘటన జరిగింది. డీజే సౌండ్ కు తన కోళ్ల ఫామ్ లోని కోళ్లన్ని చనిపోయాయని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కోళ్ల ఫామ్ పక్కన ఉన్న ఓ ఇంట్లో పెళ్లి సందర్భంగా బారాత్ లో డీజే సాంగ్స్ పెట్టగా.. అందుకు తట్టుకోలేక గిలగిలా కొట్టుకొని 63 కోళ్లు చనిపోయాయని కేసు పెట్టాడు. తన కోళ్ల చావుకు డీజేనే కారణమని వాటి యజమాని పోలీసులకు విన్నవించుకున్నాడు.
ఏం జరిగిందంటే?
ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన రంజిత్ అనే యువకుడు కోళ్లఫామ్ నడుపుతున్నాడు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన అతడు.. ఉద్యోగం లభించకపోవడం వల్ల రూ.2 లక్షలు లోన్ తీసుకుని కోళ్ల ఫామ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం ఆ ఫామ్ పక్కనే ఉన్న ఇంట్లో వివాహం జరిగింది. రాత్రి 11.30 గంటల సమయంలో చెవులకు చిళ్లులు పడేలా డీజే సౌండ్ పెట్టారని, దీంతో కోళ్లు అల్లాడిపోయాయని, అటూ ఇటూ కొట్టుకుని కింద పడిపోయాని రంజిత్ చెప్పాడు. ఆ హోరెత్తించే శబ్దాలను తగ్గించుకోవాలని వేడుకున్నానని, అయినప్పటికీ వారు పట్టించుకోలేదని వెల్లడించాడు. దీంతో 63 కోళ్లు మృత్యువాతపడ్డాయని రంజిత్ వాపోయాడు.
మరుసటి రోజు వెటర్నరీ డాక్టర్‌కు వాటిని చూపించానని, అవి గుండె పోటుతో కన్నుమూశాయని చెప్పినట్లు వెల్లడించాడు. దీనికి డీజే శబ్దాలే కారణమని స్పష్టం చేశాడని తెలిపాడు. అయితే తనకు నష్టపరిహారం ఇవ్వాలని పెళ్లి జరిగిన ఇంటి యజమానికి అడిగానని.. వారు స్పందించలేదన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రంజిత్ వెల్లడించాడు.
Also Read: కర్ణాటకలో భారీ వర్షాలు, వరద ముంపులో బెంగళూరు నగర దృశ్యాలు
Also Read: Discount On Liquor: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే లిక్కర్ పై డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook