Viral Video: ఇదేం స్టంట్ రా నాయన.. ట్రైన్ రూఫ్ మీద పడుకుని 400 కిలోమీటర్ల జర్నీ.. వైరల్ వీడియో..
Man Dangerous Stunt: ఒక వ్యక్తి ట్రైన్ రూఫ్ మీద పడుకుని రచ్చ చేశాడు. న్యూఢిల్లీ నుంచి గోరఖ్ పూర్ వరకు కూడా అతను రూఫ్ మీద పడుకునే జర్నీచేసినట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Man Risks Life Traveling 400 kms on Delhi To Kanpur: కొందరు వెరైటీ స్టంట్ లు చేస్తుంటారు. అందరిలాగా నార్మల్ గా కాకుండా ఏదో ఒకటి వెరైటీగా చేయాలకుంటారు. ఇలాంటి పనులు చేసి వార్తలలో ఉంటారు. సాధారణంగా మనం కొందరు బస్సులల డెంజరస్ గా జర్నీలు చేస్తుంటారు. కొందరు రూఫ్ ల మీద కూర్చుని ప్రయాణిస్తుంటారు. ఇంకొందరు పుట్ బోర్డు మీద నిలబడి జర్నీలు చేస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది దూర ప్రయాణాలకు ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేస్తుంటారు. దీంతో ట్రైన్ లన్ని ఎక్కువగా రద్దీగా ఉంటాయి. అసలే సమ్మర్ ఒకవైపు.. మరోవైపు ట్రైన్ లలో జనాలు రద్దీతో ప్రయాణికులు బెంబెలెత్తిపోతున్నారు.
ఈక్రమంలో కొందరు ఆకతాయితనంగా వ్యవహరిస్తుంటారు. ట్రైన్ లలో బాత్రూంల దగ్గర, ఫుట్ బోర్డుమీద కూర్చుని మరీ జర్నీలు చేస్తుంటారు. మరికొందరు.. ట్రైన్ ల మీద కూడా ఎక్కి రిస్క్ చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఒక వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు ట్రైన్ రూఫ్ మీద పడుకుని జర్నీ చేశాడు. ట్రైన్ కాన్పూర్ ఆగాక కొందరు ప్యాసింజర్ లు గమనించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఏకంగా రైలు రూఫ్ మీద పడుకుని, న్యూఢిల్లీ నుంచి గోరఖ్ పూర్ వరకు ప్రయాణించాడు. దాదాపు అతగాడు.. 400 కిలోమీటర్ల వరకు ట్రైన్ మీదనే జర్నీ చేసినట్లు తెలుస్తోంది. కొందరు ప్యాసింజర్ లు ఇది గమనించి రైల్వే అదికారులకు సమాచారం ఇచ్చారు.
Read More: Chocolate Banana Dosa: వావ్.. యమ్మీ యమ్మీ.. చాక్లెట్ బనానా దోశ.. వైరల్ గా మారిన వీడియో..
రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని కిందకు దించారు. సదరు వ్యక్తి.. దిలిప్ కుమార్ అని పోలీసుల విచారణలో తెలింది. అతను.. ఫిరోజ్ పూర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. కాగా,అతను ఇలా డెంజరస్ గా ఎందుకు ప్రయాణించాడో అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook