Patient Preparing Gutka In Opetaion Theatre: సోషల్ మీడియా పుణ్యామా అని ప్రతిరోజు వందల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ఈ వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరికొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేసేవిగా కూడా ఉంటాయి.  సాధారణంగా సోషల్ మీడియాలో.. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొందరు కావాలని ఫన్నీగా చేస్తారో.. లేక పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారో కానీ కొన్ని వీడియోలు మాత్రం తరచుగా వార్తలో ఉంటాయి. కొందరు ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఎఫెక్ట్ వల్ల ఓవర్ నైట్ లో.. పాపులర్ అయిపోతున్నారు. ఇదిలా ఉండగా.. కొన్ని సార్లు ఎంత సీరియస్ పరిస్థితులలో ఉన్న కూడా వారు చేసిన పనుల వల్ల వారు ట్రెండింగ్ లో ఉంటారు. అచ్చం ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.



ఒక పెషెంట్ బెడ్ మీద ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడికి చుట్టుపక్కల డాక్టర్లు, నర్సులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అప్పుడు ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరు ప్రతిరోజు మద్యం తాగుతారు. మరికొందరు సిగరేట్, తంబాకు నములుతుంటారు. ఈ అలవాట్లకు చాలా అడిక్ట్ అయిపోతారు. ఇవి చేయకుంటే అస్సలు ఉండలేరు. ఇక్కడ కూడా ఒక వ్యక్తికి మరీ గుట్కా తినే అలవాటు ఉందా...?.. మరేంటో కానీ.. ఏకంగా ఐసీయూలో బెడ్ మీద గుట్కా ను చేతిలో తీసుకున్నారు.


Read MOre: Kaya Thapar: హాట్ ఫోజులతో కిరాక్ పుట్టిస్తోన్న కావ్య థాపర్.. ఇది మాములు డోసు కాదండోయ్..


అంతటితో ఆగకుండా.. దాన్ని అటు ఇటు చేతిలో వేసుకుని గుట్కాను మిక్స్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదేంది బాబోయ్.. ఐసీయూలో ఉన్నాడా.. కిళ్లీ కొట్టులో ఉన్నాడా..?అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అక్కడున్న వైద్యులు కూడా అతగాడికి మాత్రం వారించడం లేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook