Giant Python Viral Video: నీ ధైర్యానికి దండంరా సామీ.. భారీ పైథాన్ ను ఎలా తాకాడో చూడండి! గూస్ బంప్స్ పక్కా
Python Snake Video: భారీ కొండచిలువకు చిలువకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేతితో తాకుతున్న సమయంలో గూస్‌బంప్స్ మాత్రం పక్కా. ఆ వీడియో మీరూ ఓ లుక్కేయండి.
Python Snake Video: ఇటీవల నెట్టింట పాములకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాములతో స్నేక్ క్యాచర్లు చేసే విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే విధంగా భయంకరమైన పాములను సైతం అమాంతం పట్టేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి భారీ కొండచిలువను చేతితో ముట్టుకున్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో వ్యక్తి ఫీట్ చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు గూస్‌బంప్స్ కూడా రావచ్చు.
ఈ వీడియో ప్రారంభంలో.. ఓ వ్యక్తి ప్రమాదకరమైన భారీ కొండచిలువ తోకను చేతితో తాకుతున్నాడు. అది వెంటనే తన తోకను వ్యక్తి చేతి నుంచి దూరంగా విదిలించింది. ఆ తరువాత ఏ జరిగిందో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఆ వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా.. కొండచిలువను చేతితో తాకుతున్నట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది. చేతితో పదేపదే కొడుతున్న సమయంలో కదలికలను గమనించవచ్చు. అతను చేతితో అలా టచ్ చేస్తున్నా అది పట్టించుకోకుండా కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. కేవలం కొన్ని సెకెన్లు ఉండే ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. లైక్స్, కామెంట్స్‌తో హెరెత్తిస్తున్నారు.
Also Read: Nara Lokesh: చిరంజీవి, బాలయ్య సినిమాలకు పోటీ.. పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో నారా లోకేష్ కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook