Nara Lokesh: చిరంజీవి, బాలయ్య సినిమాలకు పోటీ.. పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో నారా లోకేష్ కౌంటర్

Chiranjeevi vs Balakrishna: ఐప్యాక్ గ్యాంగ్స్, పేటీఎం డాగ్స్ రంగంలోకి దిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అభిమాని పేరుతో సర్కిల్ అవుతున్న ట్వీట్ ఫేక్ స్పష్టం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 04:31 PM IST
Nara Lokesh: చిరంజీవి, బాలయ్య సినిమాలకు పోటీ.. పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో నారా లోకేష్ కౌంటర్

Chiranjeevi vs Balakrishna: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలకు లింక్ పెట్టి టీడీపీ అభిమాని పేరుతో ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. సమరసింహారెడ్డి వర్సెస్ స్నేహం కోసం, నరసింహనాయుడు వర్సెస్ మృగరాజు, లక్ష్మీనరసింహ వర్సెస్ అంజి, గౌతమిపుత్ర శాతకర్ణి వర్సెస్ ఖైదీ నెం.150, వీరసింహరెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య సినిమాలకు లింక్ పెట్టాడు. ఇప్పుడు రిజల్ట్ ఏమవుతుందో మీకే తెలుసు.. జై బాలయ్య అంటూ పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తు ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ఐప్యాక్ గ్యాంగ్స్, పేటీఎం డాగ్స్ రంగంలోకి దిగాయి.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

'ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి. ఫేక్ అకౌంట్స్, ఫేక్ ట్వీట్స్ నీకు ఆత్మసంతృప్తిని ఇస్తాయేమో కానీ  నిన్ను ఓటమి నుండి తప్పించలేవు జగన్ రెడ్డి..!' అంటూ నారా లోకేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 

 

చెప్పు కొట్టండి.. చెప్పుతో కొడతా.. అనే పదాలను ఏపీ పాలిటిక్స్‌లో ఇటీవల తెగ వాడేస్తున్నారు. తనను ఎవరైనా దత్త పుత్రుడు అంటే ఇక నుంచి చెప్పుతో కొడతానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. బహిరంగ సభలో మాట్లాడుతూ ఏకంగా చెప్పు చూపించి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టాలంటూ పిలుపునిచ్చారు. 

Also Read: India vs Netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ఆ ప్లేయర్ ప్లేస్‌లో రిషబ్ పంత్..! టీమిండియా తుది జట్టు ఇలా..

Also Read: WhatsApp Back: బీ రిలాక్స్.. వాట్సాప్ ఈజ్ బ్యాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News