Snake Terryfic Attack On Man While Kissing: మనలో ప్రతిఒక్కరు పామంటేచాలు భయంతో వణికిపోతుంటారు. పాములు ఉన్న చోట అస్సలు ఉండటానికి ఇష్టపడరు. కొన్నిసార్లు పాములు అడవుల నుంచి బైటకు వస్తుంటాయి. పాములు ఎక్కువగా గుబురుగా ఉండే పొగలు, చెట్లు, నీళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలు, ఎలుకలు ఉన్న చోట మనకు కన్పిస్తుంటాయి. కొందరు పాములు కన్పించగానే భయంతోపారిపోతుంటారు. మరికొందరు చాకచక్యంగా వ్యవహారించి, పాములను పట్టేవారికి సమాచారం ఇస్తారు. దీంతో స్నేక్ సొసైటీవారు చేరుకుని పాములను పట్టుకుని తీసుకెళ్లి అడవుల్లో వదిలేస్తుంటారు. మనం గ్రామాలలో కొందరు పాములను పట్టుకుని ఆడిస్తుండం చూస్తుంటాం. పాములను అడవుల నుంచి పట్టుకుని తెచ్చి ఆడిస్తూ, జీవనం సాగిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?


ఇలాంటి క్రమంలో కొన్నిసార్లు అనుకొని ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పాములను పట్టుకుని ఆడిస్తున్నప్పుడు కొన్నిసార్లు అవి కోపంతో కాటువేసిన సంఘటనలు కూడా అనేకం జరిగాయి. ఇలాంటి కోవకు చెందిన మరో విషాకర ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


ఒక వ్యక్తి నాగుపాములను అడవి నుంచి పట్టుకుని తీసుకొచ్చాడు. అంతే కాకుండా దాన్ని ఆడిస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వారంతా పామును ఆడించడం ఆసక్తిగా గమనిస్తున్నారు. అతగాడు పామును బుట్టలో నుంచి బైటకు తీశాడు. నాగు పాము చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. అంతేకాకుండా.. దాన్ని దూరంనుంచి చూస్తున్నారు. ఇంతలో అతగాడు కాస్త అతిగా ప్రవర్తించాడు. పామును ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. మరీ పాముకు కొపమెచ్చిందో ఏంటో కానీ ఒక్కసారిగా అతని ముక్కు, పెదాల వద్ద రెప్పపాటులో కాటు వేసింది. దీంతో అతను పామును వదిలేసి ఒక్కసారిగా అక్కడి నుంచి వెనక్కు జరిగిపోయాడు.


Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..


అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో పామును తిరిగి బంధించారు. పాముకాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం పాము కాటుకు చెందిన క్లిప్పింగ్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు పాము ఎంతైన విషపు జీవి.ఇలాంటి పనులు చేయకూడదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పాముతో చెలగాటం ఆడితే.. ఇలానే ఉంటదంటూ కూడా మండిపడుతున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook