Modi`s Free Mobile Recharge Scheme: ఇండియాలో ఫ్రీ మొబైల్ రీచార్జ్ స్కీమ్.. మోదీ సర్కారు కానుక నిజమేనా ?
Modi`s Free Mobile Recharge: 2024 లో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు రూ. 239 విలువ కలిగిన మొబైల్ రీచార్జ్ ఉచితంగా అందిస్తున్నారని.. అలా చేయడం వల్ల ఆ ఉచిత మొబైల్ రీచార్జ్ లబ్ధి పొందిన వాళ్లంతా బీజేపీకే ఓటు వేస్తారని చెబుతూ ఒక మెసెజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Modi's Free Mobile Recharge: 2024 లో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు రూ. 239 విలువ కలిగిన మొబైల్ రీచార్జ్ ఉచితంగా అందిస్తున్నారని.. అలా చేయడం వల్ల ఆ ఉచిత మొబైల్ రీచార్జ్ లబ్ధి పొందిన వాళ్లంతా బీజేపీకే ఓటు వేస్తారని చెబుతూ ఒక మెసెజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌లో ఈ వైరల్ మరీ ఎక్కువ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ ని జనం భారీ సంఖ్యలో షేర్ చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ కి నెటిజెన్స్ ఒక పేరు కూడా పెట్టేశారు. ఆ పేరు ఏంటంటే.. ఫ్రీ మొబైల్ రీచార్జ్ స్కీమ్ అని నామకరణం చేశారు. 28 రోజుల వ్యాలిడిటీతో ఇండియాలో ఉన్న మొబైల్ యూజర్స్ అందరికీ ఈ ఫ్రీ మొబైల్ రీచార్జ్ స్కీమ్ వర్తిస్తుందని ఆ మెసేజ్ లో పేర్కొన్నారు. ఈ ఫ్రీ మొబైల్ రీచార్జ్ స్కీమ్ వర్తించాలంటే.. ఆ మెసేజ్ కింద ఉన్న బ్లూ లింక్ పై క్లిక్ చేయాల్సిందిగా ఫ్రాడ్‌స్టర్స్ సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ చూసిన అమాయక జనం అది నిజమే అనుకుని అందులో చెప్పిన విధంగా పది మందికి, 20 మందికి షేర్ చేయడంతో పాటు అందులో ఉన్న బ్లూ కలర్ లింకుపైనా క్లిక్ చేస్తున్నారు.
ఇంకొంత మంది ఇది నిజమా, అబద్ధమా అని ఆలోచిస్తూ అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం అధ్యయనం చేసి అసలు నిజం బయటపెట్టింది.
సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న మెసేజ్‌లో నిజం లేదని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చిచెప్పింది. ప్రస్తుతం కేంద్రం అలాంటి ఫ్రీ మొబైల్ రీచార్జ్ స్కీమ్ ఏదీ అందించడం లేదని స్పష్టంచేసింది.