Monkey Rescues Kitten From Muddy Pit: సహజంగా జంతు ప్రపంచంలో ఒక జంతువుకు మరో జంతువుకు జాతి వైరం ఉంటుంది. ముఖ్యంగా పిల్లికి, శునకానికి ఎలాగైతే జాతి వైరం ఉంటుందో.. పిల్లికి కోతికి కూడా అదే విధమైన జాతి వైరం ఉంటుంది. పిల్లి, కోతి రెండూ కూడా టామ్ అండ్ జెర్రీ లాంటివే. రెండింటికి ఒకటంటే మరొక దానికి పడదు. కానీ రెండింటి మధ్య ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ.. ఒకదానికి ఆపద వస్తే మరొకటి ఆదుకోవడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది.. ఆపదలో ఉన్న నేస్తాన్ని ఎన్ని కష్టాలైనా పడుతుంది అని ఓ కోతి నిరూపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని వీడియోలు మనసును తట్టి లేపుతాయి. కొన్ని వీడియోలు మనసును కదిలిస్తాయి. ఇంకొన్ని వీడియోలను వర్ణించడానికి మనసులో భావాలు కూడా సరిపోవు.. ఆ భావాలను పలికించడానికి పదాలు కూడా రావు. ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియో కూడా అలాంటిదే. ఒక పిల్లి పిల్ల తనకు తెలియకుండా వెళ్లి రింగులతో నిర్మించిన ఓ నీటి తొట్టిలో పడిపోయింది. ఆ నీటి తొట్టిలో నీళ్లు లేవు కానీ అడుగు భాగం అంతా బురద పేరుకుపోయి ఉంది. ఆ పిల్లి పిల్లకి అందులోంచి ఎలా బయటికి రావాలో అర్థం కాలేదు. పెద్ద పిల్లి అయితే ఎలాగైనా సరే ఎగిరి ఆ నీటి తొట్టిలోంచి బయటికొచ్చేది. పెద్ద పిల్లికి అది పెద్ద కష్టమైన పనేమీ కాదు.. అది చిన్న పిల్లి కావడంతో ఆ నీటి తొట్టిలోనే సహాయం కోసం అరుస్తూ ఆపన్నహస్తం ఎదురుచూస్తోంది. 


ఆ పిల్లి పిల్ల అరుపులు విన్న ఓ కోతి పిల్ల.. దానిని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. కోతి పిల్ల చిన్నదే అయినా.. దాని మనసు పెద్దది. అందుకే పెద్ద మనసుతో ఆ తొట్టిలోకి దిగి తన తాహతు మించి ఆ చిన్న పిల్లిని బయటికి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. కానీ ఆ కోతి పిల్ల వల్ల కూడా కాలేదు. ఏదైనా తాడు లాంటిది చేతికి దొరికితే.. ఆ తాడుతో పిల్లిని బయటికి తీసుకొద్దామన్నట్టు ఆ బురదలోనే చేయి పెట్టి అంతా పునికి చూసింది. కానీ దురదృష్టవశాత్తుగా ఆ కోతి పిల్లకు ఏమీ దొరకలేదు.   


కానీ అప్పటికే బిక్క చచ్చిపోయిన ఆ చిన్న పిల్లిని అలా వదిలేయడం ఇష్టం లేని ఆ కోతి మరొక అమ్మాయి సహాయం తీసుకుంది. కోతి పడుతున్న తాపత్రయం చూసి ఆ నీటి తొట్టిలో ఏదో ఉందని అర్థం చేసుకున్న ఒక అమ్మాయి.. ఆ కోతి వెంట వెళ్లి లోపలికి చూసింది. అమ్మాయికి సీన్ మొత్తం అర్థమైంది. ఆ నీటి తొట్టిలోకి దిగి బురదలో ఉన్న పిల్లిని బయటికి తీసింది. అప్పుడు చూడాలి ఆ కోతి ముఖం సంతోషం... ఆ చిన్న పిల్లిని కష్టంలోంచి గట్టెక్కించానన్న ఆనందం ఆ కోతి పిల్ల ముఖంలో స్పష్టంగా చూడొచ్చు. అంతేకాదు.. క్షణం ఆలస్యం చేయకుండా.. ఆ పిల్లికి అంటిన బురదను తొలగించడం మొదలుపెట్టింది. 



ఇది కూడా వీక్షించండి : Bear Vs Man Video: ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కబోయాడు.. కానీ అంతలోనే


జాతి వైరాన్ని పక్కనపెట్టి పిల్లిని అక్కున చేర్చుకున్న కోతిని చూస్తే.. మానవ సంబంధాలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో ఆ కోతి పిల్ల నుంచి మనిషి చాలానే నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. అంత చిన్న కోతి పిల్లకే అంత గొప్ప జాలి గుణం ఉంటే.. మంచి, చెడు తెలిసిన మనుషులం.. కష్టంలో ఉన్న తోటి మనిషికి సహాయం చేయడంలో మనకు ఇంకెంత గొప్ప మనుసు ఉండాలి. ప్రేమను పంచే ఈ వైరల్ వీడియో కథనం మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులు, బంధుమిత్రులకు షేర్ చేసి వారితో పంచుకోండి... ఈ లవ్లీ వీడియో స్టోరీని నలుగురికి చేరవేయండి.


ఇది కూడా వీక్షించండి : Baby Elephant Viral Video: పిల్ల ఏనుగు వింత చేష్టలు చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK