Monkey Slaps Women: హా.. హా.. పాపం.. ఫుడ్ పెట్టిన అమ్మాయిని లాగి పెట్టి కొట్టిన కోతి

Money Funny Viral Video: కోతులన్నీ ఒకేలా ఉండవు కదా.. కొన్ని కోతులు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటే.. ఇంకొన్ని కోతులు హై బీపీ పేషెంట్స్‌లా, ముక్కు మీదే కోపం ఉందన్నట్టు విరుచుకుపడుతుంటాయి. నిప్పు తొక్కిన కోతి అంటారు చూడండి.. అలా రెచ్చిపోయి మనుషులకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో కూడా ఇంచుమించు అలాంటి ఫన్నీ వీడియోనే. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2023, 07:54 PM IST
Monkey Slaps Women: హా.. హా.. పాపం.. ఫుడ్ పెట్టిన అమ్మాయిని లాగి పెట్టి కొట్టిన కోతి

Monkey slpas a Girl while Making a Video: ఇన్‌స్టాగ్రామ్‌లో షాట్స్ పోస్ట్ చేయడం, యూట్యూబ్‌లో రీల్స్ పోస్ట్ చేయడం.. ఆ వీడియోలతో భారీగా లైక్స్ పోగేసుకుని, ఫాలోవర్స్ పెంచుకోవడం కొంతమంది దినచర్యలో ఓ భాగమైపోయింది. ఇంకా చెప్పాలంటే అదే వారికి ఫుల్ టైమ్ జాబ్ కూడా. రోజూ ఒక అందమైన డ్రెస్ వేసుకోవడం.. ఏదో ఒక క్రేజీ ట్యూన్‌కి కానీ లేదా ట్రెండింగ్ ఆడియో ట్రాక్‌కి మ్యాచ్ అయ్యేలా ఒక స్టెప్పేయడం, లేదా తాము ఎంచుకున్న మిత్రులతో సరదాగా ఓ ప్రాంక్ చేయడం, జోక్ చేయడం.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఇదే వారికి ఓ రెగ్యులర్ యాక్టివిటీ. అయితే, మనుషులతో రీల్స్ చేయడం వరకు ఓకే కానీ జంతువులతో రీల్స్ చేయడం అంటే అది అన్నిసార్లు కలిసొచ్చే అంశం కాదు సుమీ.. అందులోనూ కోతులతో వీడియోలు చేయడం అంటే ఇంకా రిస్క్.

కోతులతో రీల్స్ చేసి ఆకట్టుకున్న యూట్యూబర్స్‌ని మీరు ఎంతోమందిని చూసి ఉంటారు. అందులో చాలా వీడియోలు ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేవిగానే ఉంటాయి. అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తూ మనిషి చెప్పినట్టే విని నడుచుకునే కోతులను మీరు రీల్స్ వీడియోలలో చూసే ఉంటారు. కానీ అన్నిసార్లు కాలం కలిసిరాదు కదా.. కోతులన్నీ ఒకేలా ఉండవు కదా.. కొన్ని కోతులు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటే.. ఇంకొన్ని కోతులు హై బీపీ పేషెంట్స్‌లా, ముక్కు మీదే కోపం ఉందన్నట్టు విరుచుకుపడుతుంటాయి. నిప్పు తొక్కిన కోతి అంటారు చూడండి.. అలా రెచ్చిపోయి మనుషులకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అనే కదా మీ సందేహం.. అయితే ముందుగా మీరు ఈ వీడియో చూడండి... మిగతా విషయాలు తరువాత చెప్పుకుందాం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Justic Memes (@thejusticmemes)

ఇది కూడా చదవండి : Lions Hunting Newborn Buffalo Calf: గుండెల్ని పిండేసే వీడియో.. అప్పుడే పుట్టిన దూడను చుట్టుముట్టిన సింహాలతో తల్లి ఒంటరి పోరాటం

చూశారు కదా.. ఇప్పుడు అర్థమైందా ఎందుకు కోతి లక్షణాల గురించి మనం ఇంత ఉపోద్ఘాతం చెప్పుకున్నామో. అదండీ సంగతి. కోతికి ఆహారం పెట్టి.. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించాలనుకున్న ఓ యువతి.. తన మిత్రులతో కలిసి వెళ్లి డాబా మీదున్న కోతికి ఆహారం పెట్టింది. అది చూసిన కోతి వెంటనే వచ్చి అమితానందంతో ఆ ఆహారాన్ని తింటుంది అని అనుకున్నారు అక్కడున్న వాళ్లంతా.. కానీ ఆ కోతి మాత్రం ఊహించని షాక్ ఇస్తూ.. ఆ ఆహారం తెచ్చిపెట్టిన అమ్మాయి చెంపపైన లాగి పెట్టి పడేల్‌మని శబ్ధం వచ్చేలా ఒక్కటిచ్చింది. కోతి నుంచి వచ్చిన ఊహించని రియాక్షన్ చూసి షాకవడం ఆ అమ్మాయి వంతయ్యింది. ఈ మొత్తం దృశ్యాన్ని అమ్మాయి ఫ్రెండ్స్ తమ మొబైల్ కెమెరాల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న టెక్ట్స్ చూశారు కదా.. అడగనిదే ఆహారం పెట్టినందుకు దక్కిన పనిష్మెంట్ ఇది అన్నట్టుగా నెటిజెన్స్ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Couple First Night Video: పొరపాటున సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో పోస్ట్.. ఫుల్ వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News