Naa Anveshana Income: సోషల్‌ మీడియాలో నా అన్వేషణ అనే ప్రపంచ యాత్రికుడి గురించి అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌తోపాటు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. తాను తీసే వీడియోలకు భారీ స్పందన లభిస్తుండడంతో అదే స్థాయిలో అతడికి ఆదాయం లభిస్తోంది. అయితే తన సంపాదనపై తొలిసారి స్పందించాడు. తనకు ఎంత డబ్బు వస్తుందో వివరించాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Girl Friend Attack: నిఖాలో ప్రియురాలి తడాఖా.. పెళ్లి మండపంలో యాసిడ్, కత్తితో దాడి


 


నా అన్వేషణ పేరుతోనే ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా ఓ కీలక ప్రకటన చేశాడు. కొన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఓ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియో ద్వారా తన సంపాదనను కూడా వివరించాడు. భారతదేశ ప్రజలు పన్ను చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ విదేశాల్లో ప్రజలు భారీ స్థాయిలో పన్నులు చెల్లిస్తున్నారని.. అందుకే ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని వాదించాడు. భారత ప్రజలు కూడా పన్నులు చెల్లించడం ప్రారంభిస్తే బంగారంతో రోడ్లు వేసుకోవచ్చని పేర్కొన్నాడు.

Also Read: Third Wave Coffee: కాఫీషాప్‌ బాత్రూమ్‌లో కెమెరా.. మహిళల రహాస్య వీడియోలు చిత్రీకరణ


 


తాను విదేశాల్లో ఉంటున్నా కూడా తాను భారతదేశానికి పన్ను చెల్లిస్తున్నట్లు అన్వేష్‌ ప్రకటించాడు. తాను ఉంటున్న అమెరికాలోనూ భారీగా పన్ను చెల్లింపులు చేస్తున్నట్లు వివరించాడు. నాలుగేళ్ల కింద భారత్‌ను విడిచిపెట్టిపోయినా కూడా తాను స్వదేశానికి పన్నులు చెల్లిస్తున్నట్లు తెలిపాడు. ప్రజలు పన్ను కొంత చెల్లించి భారీగా లబ్ధి పొందుతున్నారని పన్ను ఎగ్గొడుతున్న వారిపై మండిపడ్డారు. 2023లో తాను సంపాదించినది 2 కోట్ల 50 లక్షలు అని ప్రకటించాడు. తాను సంపాదించిన డబ్బులో నుంచి భారతదేశంతోపాటు అమెరికాలోనూ పన్నులు చెల్లించినట్లు పేర్కొనడం విశేషం. పన్ను ఎగ్గొట్టద్దని ఈ సందర్భంగా అన్వేష్‌ విజ్ఞప్తి చేశారు.


నిత్యం ట్రెండింగ్ లో..
విశాఖ యాసలో మాట్లాడుతూ వీడియోలు చేస్తూ అన్వేష్‌ నిత్యం ట్రెండింగ్‌లో ఉంటాడు. ఏపీ ఎన్నికల సమయంలో అన్వేష్‌ వీడియోలు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అతడి వీడియో కేంద్రంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య తీవ్ర రచ్చ జరిగింది. నారా లోకేశ్‌ అతడికి డబ్బులు ఇచ్చి వీడియోలు చేయించాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కొన్నాళ్లు ఏపీలో అన్వేష్‌ రాజకీయంగా హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఆ తర్వాత తెలంగాణకు చెందిన ట్రావెల్‌ వ్లాగర్‌పై అన్వేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోషల్‌ మీడియాలో రచ్చ జరిగింది. యూట్యూబర్లు ఇరువురు సామాజిక మాధ్యమాల్లో యుద్ధానికి దిగారు. ఇలా అన్వేష్‌ నెట్టింట్లో ఎప్పుడు హల్‌చల్‌ చేస్తుంటాడు.

అన్వేష్‌ ఎవరు?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన అన్వేశ్‌ ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డు కుమారుడు. కష్టపడి తెలుగు రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేసిన అన్వేష్‌ అనంతరం యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ట్రావెల్‌ వ్లాగర్‌గా మారి కొత్త కొత్త ప్రదేశాల విశేషాలు పంచుకుంటూ ఉన్నాడు. మంచి స్పందన రావడంతో ప్రపంచ యాత్రలు మొదలుపెట్టాడు. వివిధ దేశాల్లో తిరుగుతూ ఆ విషయాలను పంచుకుంటూ ఉంటాడు. తన పేరు వచ్చేలా యూట్యూబ్‌లో 'నా అన్వేషణ' అంటూ 2 ఆగస్టు 2019లో ఛానల్‌ ప్రారంభించాడు. అప్పటి నుంచి అతడికి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానంతో అతడు ఉత్సాహంతో ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. ఇప్పటివరకు అన్వేష్‌ దాదాపు 90 దేశాలు తిరిగాడు.



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి