Trending Video : పోలీసులు ప్రజలను రక్షించడమే కాదు.. వారికి వినోదం కూడా పంచుతున్నారు. ఇది మామాట కాదు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా అదే అనుకుంటారు. బాలీవుడ్ హిట్ సాంగ్స్ పై న్యూజీలాండ్ పోలీసులు డ్యాన్స్ చేయడం చూసి, వారి జోష్ చూసి మీలో కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ర్యాపర్ బాద్షా ( Badhshah ) పాటలపై పోలీసు ఆఫిసర్లు డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీపావళి ( Diwali ) సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపిన న్యూజీలాండ్ పోలీసులు ఇలా భారతీయ పాటలపై డ్యాన్స్ చేసి చూపించారు. ప్రపంచంలో అత్యాధునిక పోలీసు శాఖల్లో ఒకటైన న్యూజిలాండ్ పోలీసులు, డ్యాన్స్ లో కూడా తిరుగులేదు అని ప్రూవ్ చేసుకున్నారు. 


కర్గయి చుల్, కాలా చష్మా అనే పాటలపై సుమారు రెండు నిమిషాల పాటు పోలీసు అధికారులు డ్యాన్స్ చేశారు. అయితే అది చూసిన నెటిజెన్లు ( Netizens ) రెండు నిమిషాల డ్యాన్స్ కోసం వాళ్లు ఎంత కాలం కష్టపడ్డారో అని తెగపొగుడుతున్నారు. దాంతో పాటు భాషకాని భాషను అర్థం చేసుకోకుండా మిస్ అవకుండా డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు కదా.



 


ఈ వీడియోను వెల్లింగ్డట్ కౌన్సిల్ లో షూట్ చేయడగా న్యూజిలాండ్ లో భారత హైకమిషన్ ట్విట్టర్ ఎకౌంట్ లో షేర్ చేశారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR