Viral news: నదిలో తేలుతూ వచ్చిన పెట్టె.. తెరిచే చూస్తే దేవతల ఫోటోలతో పసికందు
Newly born baby girl found in wooden box floating in Ganga river: ఘాజీపూర్: సినీ ఫక్కీలో ఓ చిన్నారి పసి కందును వదిలేసిన వైనం ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్ సమీపంలో బుధవారం గంగా నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు (Fisher men) అక్కడ ఓ పసికందు ఏడుస్తున్న శబ్ధం వినిపించింది.
Newly born baby girl found in wooden box floating in Ganga river: ఘాజీపూర్: సినీ ఫక్కీలో ఓ చిన్నారి పసి కందును వదిలేసిన వైనం ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్ సమీపంలో బుధవారం గంగా నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు (Fisher men) అక్కడ ఓ పసికందు ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. ఏంటా అని నీళ్లవైపు చూస్తుండగా అటువైపు నీటిపై తేలుతూ వస్తున్న పెట్టె కనిపించింది. ఏంటా అని తెరిచి చూస్తే.. అందులో ఓ గుడ్డలో చుట్టి ఉన్న చిన్నారి పసి కందు కనిపించింది. అదే పెట్టెలో దేవతల ఫోటోలు, ఆ చిన్నారి జాతకం రాసిపెట్టి ఉన్నాయి. ఆ వివరాల ప్రకారం ఆ పసి కందు వయస్సు 22 రోజులు అని తెలుసుకున్నారు.
పెట్టెలో పసి కందు (Baby girl found in box) లభించిందనే వార్త తెలుసుకున్న స్థానిక పోలీసులు, అధికారులు ఆ పసి కందును చిన్నారుల సంరక్షణ బాధ్యతలు చూసుకునే ఆశా జ్యోతి కేంద్రానికి తరలించి అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also read : Photo puzzle: ఈ ఫోటోలో దాగి ఉన్న Tiger ని గుర్తించగలరా ?
అధికారుల ద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath).. ఆ పసి కందు సంరక్షణ బాధ్యతలు అన్నీ యూపీ సర్కార్ చూసుకుంటుందని ప్రకటించారు. అనాథగా లభించిన ఆ చిన్నారికి గంగ అనే పేరు కూడా పెట్టారు.
Also read : 10 Babies Born At once: ఒకే కాన్పులో 10 మంది శిశువులు జననం, Guinness World Record
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook