Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉండబోతుందా..యోగీ స్థానంలో మరో నేతకు అవకాశమిస్తున్నారా..యోగీ ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు కారణమేంటి. రెండ్రోజుల పర్యటనలో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) హఠాత్తుగా రెండ్రోజుల ఢిల్లీ పర్యటన చేపట్టడం ఆసక్తి కల్గిస్తోంది. యూపీలో కీలకమైన పరిణామాలు జరగనున్నాయనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన 24 గంటల్లో యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో (Yogi Delhi Tour) భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలవనున్నారు. ఈ ముగ్గుర్ని కలవడం యాధృచ్ఛికం కాదని తెలుస్తోంది.
ఇవాళ తొలిరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను(Amit shah) కలిశారు యోగీ ఆదిత్యనాథ్. మరోవైపు అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ కాస్సేపటి క్రితం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వచ్చే యేడాది జరగనున్న యూపీ ఎన్నికల నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వ మార్పు జరగనుందనే ప్రచారం సాగుతోంది. యూపీలో (Uttar pradesh) మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి ఈ ఆకస్మిక పర్యటన అని కూడా తెలుస్తోంది. బీజేపీ నుంచి అధికారికంగా ఈ విషయంపై ఏ విధమైన ప్రకటన లేకపోయినా..నాయకత్వ మార్పు గురించి చర్చించేందుకే ఆకస్మిక పర్యటన జరిగిందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇవాళ హోంమంత్రి అమిత్ షాతో చర్చ అనంతరం కాస్త స్పష్టత రానుంది. రేపు ప్రధాని మోదీ(Pm Narendra modi), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో( JP Nadda) కలయిక అనంతరం పూర్తిగా ఫలితం తేలనుంది. నాయకత్వ మార్పు చర్చే లేదని..కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పర్యటన చేపట్టారని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.
Also read: Vaccination Certificate: వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లో తప్పులున్నాయా..ఇలా సరి చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook