Bride Mass Steps On Guntur Kaaram Movie Kurchi Madathapetti Song: సోషల్ మీడియా, రీల్స్ పుణ్యామా అని కొందరు ఓవర్ నైట్ లో స్టార్ లుగా మారిపోతున్నారు. డ్యాన్స్ లు, రీల్స్ చేస్తు తమ టాలెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు కాస్త వైరల్ గా మారిపోయి రాత్రిరాత్రే జీవితంలో ఊహించని విధంగా పాపులారిటీని తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిలో డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు, పెళ్లిలో వెరైటీ సంఘటనల వీడియోలు ఉంటున్నాయి. వెరైటీ కంటెంట్ ఉన్న వీడియోలు చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ మధ్య కాలంలో సినిమాల్లోని పాటలకు పెళ్లిళ్లలో కొత్త జంట మాస్ స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇప్పటికే... పెళ్లిలో వధువులు మాస్ స్టెప్పులతో అదరగొట్టిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా, ఈకోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.


పూర్తివివరాలు..


హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఎంత ఫెమస్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో కుర్చీని మడతపెట్టి సాంగ్ ఆ సినిమాకే హైలేట్ గా నిలిచిందని చెప్పడంతో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఇదిలా ఉండగా.. ఈపాటమీద అనేక మంది అమ్మాయిలు, ఇది వరకే అదిరిపోయిన స్టెప్పులు వేసిన అనేక వీడియోలు ట్రెండింగ్ లో నిలిచాయి.


Read More: Girls Romance In Metro: మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ అమ్మాయిల రొమాన్స్..


తాజాగా, ఒక యువతి స్టేజీమీదనే కుర్చీని మడతపెట్టిన సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. పెళ్లికూతురు హెవీ కాస్ట్యూమ్ లలో యువతి మాస్ స్టెప్పులు వేశారు. చుట్టుపక్కల కొందరు పిల్లలు ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. పెళ్లివేడుక ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter