సన్నీలియోన్ తనతో కొన్నేళ్లపాటు కలిసి జీవించిన ఒక పెంపుడు కుక్కను తలుచుకొని కంటతడి పెట్టేసింది. పది సంవత్సరాల పాటు కలిసి ఉన్నందుకు నేను లక్కీ అంటూ ట్వీట్ చేసింది.  పెంపుడు కుక్క చాపర్ ను అల్లారుముద్దుగా పెంచుకున్నానని... ఈ క్షణంలో ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటి సన్నీలియోన్ అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క చనిపోయింది. దీంతో కుక్క చాపర్ ఫోటోని పోస్ట్ చేసి కంటతడి పెడుతూ ‘‘మన బెస్ట్ ఫ్రెండ్‌ని కోల్పోతే ఆబాధను మాటల్లో చెప్పలేం. నీతో పది సంవత్సరాల పాటు కలిసి ఉన్నందుకు నేనే లక్కీ. నువ్వొక సైనికుడివి.. ఫైటర్‌వి. నీవు ఎప్పటికీ మాకు ఏంజల్ వి . లవ్యు చాపర్! నీ ఆత్మకు శాంతి కలగాలి(RIP)’’ అంటూ ట్వీట్ చేసింది.