ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇదే చివరి అవకాశం. మీ పీఎఫ్ అక్కౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేశారా లేదా. చేయకపోతే వెంటనే చేయండి. ఒక్కరోజు మాత్రమే మిగిలింది. లేకపోతే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EPFO, UAN రెండింటినీ అనుసంధానం చేయడం తప్పనిసరి. మీ ఆధార్ నెంబర్‌తో పీఎఫ్ ఎక్కౌంట్‌ను(PF Account)అనుసంధానం చేయని పక్షంలో వెంటనే చేయండి. గడువు ఒక్కరోజు మాత్రమే మిగిలుంది. అంటే నవంబర్ 30 చివరితేదీ. లేకపోతే మీ పీఎఫ్ ఎక్కౌంట్ మూతపడుతుంది. వాస్తవానికి ఈ గడువు ఆగస్టు 31, 2021తోనే ముగిసినా..ఆ తరువాత గడువును నవంబర్ 30 వరకూ పెంచారు. ఇప్పుడా గడువు కూడా ముగుస్తోంది. అందుకే ఈపీఎఫ్ అక్కౌంట్‌ను వెంటనే ఆధార్ నెంబర్‌తో లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. 


తక్షణం ఈ రెండ్రోజుల్లో పీఎఫ్ ఎక్కౌంట్ - ఆధార్ నెంబర్‌ను(PF Account-Aadhaar Link) లింక్ చేయకపోతే పీఎఫ్ ఖాతా మూతపడటమే కాకుండా ఇతర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. రెండింటినీ లింక్ చేయకపోతే పీఎఫ్ ఎక్కౌంట్ డిపాజిట్ నిలిపివేయబడుతుందని ఇప్పటికే ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అంతేకాదు ఖాతాదారులు పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు. కోవిడ్ 19 దృష్టిలో ఉంచుకుని కల్పించిన పీఎఫ్ విత్‌డ్రా (PF Withdraw)సౌకర్యాన్ని, ప్రయోజనాన్ని పొందలేరు. నిర్ణీత సమయానికి యూఏఎన్-ఆధార్ అనుసంధానం చేయనివారికి మరో నష్టం ఇన్సూరెన్స్ ఉంటుంది. లేకపోతే ఉద్యోగి వాటా ప్రీమియం డిపాజిట్ చేయకపోతే 7 లక్షల వరకూ భీమా రక్షణను కోల్పోవల్సివస్తుంది. 


ఇక పెన్షనర్లు ప్రతి యేటా నవంబర్ నెలలో తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే పెన్షనర్ సజీవంగా ఉండేలా చేస్తాయి. మీరు కనుక పెన్షనర్ అయితే..లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే నవంబర్ 30లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే పెన్షన్ నిలిచిపోతుంది. ఏడాదికోసారి లైఫ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. 2021 జనవరిలో మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించకపోతే మరోసారి చేయాల్సిన అవసరం లేదు. 


Also read: Smart Monkey Videos: మెట్లు దిగలేని స్మార్ట్ కోతి ఏం చేసిందో ఈ వైరల్ వీడియో చూసేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook