Obscene Videos: కేబుల్ టీవీలో అశ్లీల వీడియోలు.. దిగ్భ్రాంతికి లోనయిన కుటుంబసభ్యులు
Obscene Videos Plays In Cable TVs ఇంటిల్లిపాది కలిసి టీవీ చూస్తుండగా అనూహ్యంగా అశ్లీల వీడియోలు ప్రసారమవడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు ఇబ్బందికి లోనయ్యారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Obscene Videos: టెలివిజన్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉపకరణం. వినోదం కోసం ఏర్పాటుచేసుకునే టీవీలో అనూహ్యంగా అభ్యంతకర రీతిలో అసభ్య వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. కుటుంబసభ్యులు అంతా కలసి చూస్తున్న సమయంలో అనూహ్యంగా ప్రత్యక్షమైన అశ్లీల వీడియోతో ఇబ్బందులు పడ్డారు. ఇలా ఒక్కసారి కాదు రెండు కాదు పలుమార్లు అశ్లీల వీడియోలు ప్రసారమవుతుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నందికొట్కూరులో చోటుచేసుకుంది.
Also Read: Scarlet Snake: సొగసైన అందాలతో బుసలు కొడుతున్న పాము.. భయపడక్కర్లేదు విషం లేదు
నందికొట్కూరు పట్టణంలో ఫిరోజ్ డిష్ కేబుల్ సర్వీసు ఉంది. పట్టణంలో వీరి డిష్ టీవీని సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న ఇళ్లకు టీవీ ప్రసారాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల టీవీలో ప్రసారాలు చూస్తుండగా అనూహ్యంగా అశ్లీల దృశ్యాలు వచ్చాయి. నీలి చిత్రాలు దాదాపు కొన్ని నిమిషాల పాటు ప్రసారమయ్యాయి. సినిమా చూస్తున్న క్రమంలో ఇలాంటి వీడియోలు రావడంతో కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు వెంటనే టీవీని ఆఫ్ చేశారు. మరికొందరు ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
Also Read: Temple Thieves: ఈ దొంగలకు దేవాలయాలు కనిపిస్తే చాలు.. దేవుడికే నిలువు దోపిడీ
అశ్లీల చిత్రాలు ప్రసారం చేసిన డిష్ నిర్వాహకులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో నందికొట్కూరు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పరిటాలకు చెందిన ఫైబర్ నెట్ నిర్వాహకుడు ఫిర్యాదులో వాస్తవం ఏం జరిగిందో వివరించారు. ఉదయం పూట సినిమా చూస్తుండగా మధ్యలో 30 నిమిషాలు నీలి చిత్రాలు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ దృశ్యాలకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశారు. దసరా సెలవులతో ఇంటిల్లిపాది టీవీ చూస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం సరికాదని పేర్కొన్నారు.
అయితే ఒకరి నిర్వాకం వల్ల ఈ సంఘటన చోటుచేసుకుని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఆదరిస్తున్న ఈ డిష్ కేబుల్‌లో ఇలాంటివి రావడం మొదటిసారని పేర్కొంటున్నారు. కాగా టీవీల్లో అశ్లీల ప్రసారాల వీడియోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రీతిలో స్పందిస్తున్నారు. 'సొళ్లు కార్చండి' అంటూ కొందరు తెలుపుతుండగా.. 'అరె ఏంట్రా ఇది' అని కామెంట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి