Old Man made a dangerous stunt on a Running bike: కుర్రాళ్లకు, బైక్‌కీ అవినాభావ సంబంధం ఉంటుంది. కుర్రాళ్ల చేతిలో బైక్ ఉంటే రెచ్చిపోతారు. వాళ్లను ఆపడం చాలా కష్టం కూడా. బైక్‌పై వేగంగా దూసుకెళుతూ.. 'సాహసమే శ్వాసగా' సాగిపోతారు. చాలామంది కుర్రాళ్లు బైక్‌పై స్టంట్స్ చేస్తుంటారు. కుర్రాళ్ల స్టంట్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో మనం చూస్తుంటాం. అయితే ఓ తాత కుర్రాళ్లకు మించి బైక్‌పై స్టంట్స్ చేశాడు. అంతేకాదు డ్యాన్స్‌ కూడా చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ వృద్ధుడు బైక్‌తో రోడ్డుపై స్టంట్స్ చేశాడు. మొదటగా అతను బైక్ హ్యాండిల్‌ని విడిచిపెట్టాడు. ఆపై బైక్‌పై డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు. అంతేకాదు బైక్‌పై జంప్ కూడా చేస్తాడు. అక్కడితో ఆగకుండా వెనకాలకు వంగి చేతులను కూడా ఊపుతాడు. లేచాక రెండు చేతులతో బైక్‌పై డాన్స్ చేస్తాడు. వృద్ధుడు బైక్‌పై ఇన్ని స్టంట్స్ చేసినా కిందపడకపోవడం గమనార్హం. కుర్రాళ్లు కూడా చేయలేని రీతిలో తాత స్టంట్స్ చేశాడు. 



బైక్‌పై తాత స్టంట్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని 'ajit_navghane_official_07' పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వారం క్రితమే పోస్ట్ చేసిన ఈ వీడియోకి భారీ స్థాయిలో లైకులు వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 2 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన అందరూ బైక్‌పై తాత స్టంట్స్ చూసి షాక్ అవుతున్నారు. ముసలోడే కానీ మహానుభావుడు, తాత సూపరో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Durga Ashtami 2023: దుర్గాష్టమి నాడు గ్రహాల 'మహా సంయోగం'.. ఈ రాశుల వారికి లాటరీ! అపారమైన డబ్బు పక్కా  


Also Read: Lovers Funny Viral Video: ప్రేమకు ఏదీ అడ్డుకాదు.. ప్రేమికుడికి అందకుంటే ఎత్తుకుని మరీ పెట్టేసిందిగా!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.