These 4 zodiac signs will get new job due to Durga Ashtami 2023: ఈ సంవత్సరం మహా అష్టమి నాడు అరుదైన గ్రహ సంయోగం జరుగుతోంది. 30 సంవత్సరాల తరువాత చైత్ర నవరాత్రుల సందర్భంగా శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో ఉంటుంది. అదే సమయంలో గురువు తన సొంత రాశి మీన రాశిలో ఉంటాడు. ఈ సమయంలో మరికొన్ని గ్రహాల పరిస్థితి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దీని కారణంగా మహా అష్టమి రోజున కేదార్, హన్స్, మానవీయ మరియు మహాభాగ్య వంటి రాజయోగాల యొక్క గొప్ప కలయిక ఏర్పడుతోంది. ఈ మహాష్టమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. చైత్ర నవరాత్రుల మహా అష్టమి 2023 మార్చి 29న వస్తుంది. ఏ రాశి వారికి ఈ మహా గ్రహ కలయిక చాలా శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
మిథునం:
చైత్ర నవరాత్రుల అష్టమి నాడు ఏర్పడిన రాజయోగాల శుభ కలయిక మిధున రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు భారీ మొత్తంలో లాభాలు రావచ్చు.
కన్యా:
చైత్ర నవరాత్రుల అష్టమి నాడు గ్రహాల గొప్ప కలయిక కన్యా రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులు ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ ప్రయాణం శుభ ఫలితాలను ఇస్తుంది. భారీ లాభాలు ఉంటాయి. పెట్టుబడికి కూడా ఇది మంచి సమయం. విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తారు.
కర్కాటకం:
ఈ రాజయోగాల కలయిక కర్కాటక రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు సక్సెస్ అంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
మీనం:
రాజయోగాల కలయిక మీన రాశి వారికి పలు విధాలుగా లాభాలను ఇస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు మంచి పదవిని పొందవచ్చు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Lovers Funny Viral Video: ప్రేమకు ఏదీ అడ్డుకాదు.. ప్రేమికుడికి అందకుంటే ఎత్తుకుని మరీ పెట్టేసిందిగా!
Also Read: Honda Price Hike 2023: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆ కారు ధర.. ఇప్పుడే బుక్ చేసుకుంటే బెటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.