Video : హార్ట్ టచింగ్.. పెంపుడు పిల్లి కోసం తల్లడిల్లిన వృద్ధుడు.. వీడియో వైరల్
Pet Cat Viral Video:పెంపుడు పిల్లి పట్ల ఆ వృద్దుడి ప్రేమకు.. `ట్రూ లవ్.. ట్రూ హ్యాపీనెస్...` అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కన్నీళ్లతో కూడిన ఎమోజీలను పోస్ట్ చేసి.. ఆ దృశ్యం హార్ట్ టచింగ్‌గా ఉందని అభిప్రాయపడుతున్నారు.
Pet Cat Viral Video: కొంతమందికి పెంపుడు జంతువులంటే అమితమైన ప్రేమ. వాటిని తమ కుటుంబ సభ్యుల లాగే ట్రీట్ చేస్తారు. వాటికి కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు వాటికేమైనా జరిగితే బాధతో విలవిల్లాడిపోతారు. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇల్లంతా ఖాళీపోయినా తన పెంపుడు పిల్లి ప్రాణాలతో బయటపడటంతో ఓ వృద్దుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం... ఇటీవల ఆ వృద్దుడి ఇంట్లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. దీంతో ఇల్లంతా పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది. ఆ సమయంలో తన పెంపుడు పిల్లి కూడా ఇంట్లోనే చిక్కుకుపోవడంతో.. దానికి ఏం జరుగుతుందోనని ఆ వృద్ధుడు తల్లడిల్లిపోయాడు. చివరకు అది ప్రాణాలతో బయటపడటంతో ఉద్వేగానికి లోనయ్యాడు. దాన్ని చూసిన వెంటనే.. ప్రేమగా చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. పొంగి వస్తున్న దు:ఖాన్ని అణుచుకుంటూ దాన్ని గుండెలకు హత్తుకున్నాడు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేదు.
పెంపుడు పిల్లి పట్ల ఆ వృద్దుడి ప్రేమకు.. 'ట్రూ లవ్.. ట్రూ హ్యాపీనెస్...' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కన్నీళ్లతో కూడిన ఎమోజీలను పోస్ట్ చేసి.. ఆ దృశ్యం హార్ట్ టచింగ్‌గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను (Viral Video) తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకూ 58 వేల మంది ఈ వీడియోని వీక్షించగా.. 5వేల మంది లైక్ చేశారు.
Also Read: కంగనా బుగ్గల కంటే స్మూత్‌గా ఉండే రోడ్లు వేయిస్తా.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read: కారంచేడులో సంక్రాంతి సందడిని డబుల్ చేసిన బాలయ్య.. గుర్రపు స్వారీతో హల్‌చల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook