Old Man Bicycle Video: ఇటీవల సోషల్ మీడియాలో అనేక వీడియో వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ఇప్పటివరకు మీరు ఎన్నో వీడియోలు చూసినా.. ఓ తాత చేసిన స్టంట్ మాత్రం చూసి ఉండరు. రెండు చేతులు వదిలి ఎంతో హుషారుగా ఓ వృద్ధుడు సైకిల్ తొక్కుతున్న ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు సైకిల్‌పై వెళుతూ రకరకాల స్టంట్లు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వృద్ధుడి స్టంట్లను వెనుక నుంచి ఎవరో వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ.. ప్రతి క్షణం ఆస్వాదించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో వర్షా కాలంలో తీసినట్లు ఉంది. రోడ్డు అంత వర్షపు నీళ్లు ఉండగా.. చుట్టూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.


ఆ జోష్‌లో ఓ వృద్ధుడు సైకిల్ తొక్కుతూ హుషారుగా వెళుతున్నాడు. రెండు చేతుల వదిలి తొక్కుతూ.. స్పీడ్‌గా వెళుతున్నాడు. యువకులకు తాను ఏ మాత్రం తీసిపోనని నిరూపించాడు. కొన్నిసార్లు అతను రెండు చేతులు గాలిలో ఊపుతూ.. టైటానిక్ పోజ్ ఇస్తున్నాడు. తర్వాత కొంతసమయం తర్వాత రెండు కాళ్లను పైకి లేపేందుకు ప్రయత్నించాడు.  


 




ముసలోడే కానీ మహానుభావుడంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారగా.. కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుండగా.. మరికొందరు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. తాతయ్య చాలా ఆనందంగా కనిపించడం మంచి విషయమని.. కానీ చిన్న పొరపాటు జరిగినా  చాలా ప్రమాదకరమని అంటున్నారు.


Also Read: Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలక మార్పులు.. తప్పక తెలుసుకోండి  


Also Read: Bandi Sanjay: బండి సంజయ్ సంచలన నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook