Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలక మార్పులు.. తప్పక తెలుసుకోండి

Sukanya Samriddhi Yojana Scheme: మీ పిల్లల భవిష్యత్ కోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టారా..? లేదా త్వరలో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా..?  అయితే కొత్త నిబంధనలు తెలుసుకోండి. సుకన్య సమృద్ధి యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అవి ఏంటో తెలుసుకుందాం..

  • Dec 03, 2022, 16:31 PM IST
1 /5

ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్రం ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో ప్రస్తుతం 7.60 శాతం వడ్డీ ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందుతారు.

2 /5

సుకన్య సమృద్ధి యోజన పథకంలో మారిన నిబంధనల ప్రకారం.. ఇక నుంచి ఖాతాపై వార్షిక వడ్డీ ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేస్తారు. ఇంతకుముందు త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాలో జమ చేసేవారు.

3 /5

పాత నిబంధనల ఆధారంగా.. ఖాతా ఎవరి పేరు మీద ఉందో ఆమె 10 సంవత్సరాల వయస్సులో ఖాతాను ఆపరేట్ చేయవచ్చు. కానీ తాజా నిబంధనల ప్రకారం.. కుమార్తెలు 18 సంవత్సరాల కంటే ముందు ఖాతాను ఆపరేట్ చేయడానికి అనుమతిలేదు. ఆడపిల్లల సంరక్షకుడు మాత్రమే ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు ఖాతాను నిర్వహిస్తారు.  

4 /5

ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలు SSY ఖాతాలో జమ చేయవచ్చు. మీరు ఏ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే.. మీ ఖాతా డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. ఖాతా మళ్లీ యాక్టివేట్ కాకపోతే.. మెచ్యూరిటీ వరకు ఖాతాలో జమ చేసిన మొత్తంపై వర్తించే రేటుతో వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఇంతకు ముందు ఈ నియమం కాదు.  

5 /5

ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఇద్దరు కుమార్తెల ఖాతాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పుడు మీ ఇంట్లో మొదటి కుమార్తె తర్వాత రెండోసారి కవల కుమార్తెలు పుడితే.. మీరు రెండవ, మూడవ కుమార్తె కోసం కూడా సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. ఈ విధంగా ఒక వ్యక్తి ముగ్గురు కుమార్తెల ఖాతాను తెరవవచ్చు.