Viral Video: వామ్మో.. ఇలా చేస్తున్నాడేంటీ.. కాఫీలో ఉల్లిపాయల్ని ముంచి.. వైరల్ గా మారిన వీడియో..
Coffe with onions: వీడియోలో ఒక వ్యక్తి వేడి వేడి కాఫీ తాగుతున్నాడు. నార్మల్ గా ఎవరైన టీలు, పాలల్లో బిస్కెట్ లు లేదా బ్రెడ్ లు వేసుకుని తింటుంటారు. ఇది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Onion was chewed after dipping it in hot coffee: సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వీడియో లు వైరల్ మారుతుంటాయి. కొన్ని చూస్తే ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని చూస్తుంటే షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తేనే జుగుప్సకరంగాను ఉంటాయి. కొందరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండాలని వెరైటీ పనులు చేస్తుంటారు. ఓవన్ నైట్ లో ఫెమస్ అయిపోవడానికి నానా తంటాలు పడుతుంటారు. కొందరు తమ టాలెంట్ ను వీడియోలు, రీల్స్ తీసుకుంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో అప్ లోడ్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం రకరకాల టెక్నిక్ లు ఫాలో అవుతుంటారు. కొందరికి డ్యాన్స్ లు చేయడం అంటే ఎంతో పిచ్చి. అందుకే రకారకాల యాంగిల్స్ లలో తమ టాలెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
మరికొందరికి ఫుడ్ ఐటమ్స్ చేయడం ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఇలాంటి వారు మంచిఫుడ్ ఐటమ్స్ లను చేసి, అందరికి తమ టాలెంట్ ను తెలిసేలా చేస్తుంటారు. అంతేకాకుండా ఎవరికి తెలియని విధంగా ఫుడ్ ను వండటానికి ప్రయారిటీ ఇస్తుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ప్రస్తుతం foodmakescalhappy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. దీనిలో ఒక వ్యక్తి కూల్ కాఫీ తాగుతున్నాడు. మరీ అతనికి ఏమనిపించిందో ఏంటోకానీ, ఆనియన్స్ లను కాఫీలో ముంచి తినడానికి ప్రయత్నించాడు. ఆనియన్స్ లను కాఫీలో వేశాడు. అంతేకాకుండా.. ఏదో బిస్కట్ లను తిన్నట్లు, వాటిని తినేశాడు. తినేటప్పుడు బాగానే తిన్న.. తిన్నాక మాత్రం కాస్తంతా అనీజీగా ఫీలయ్యాడు. ఎదో తేడాకొడుతుందే అన్నట్లుగా ముఖం పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు ఛీ.. ఛీ.. ఇదేం అలవాటు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆనియన్స్ వాసన అదోలా ఉంటుంది.. ఏలా తినాలనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదేం పిచ్చి పైత్యం అంటూ మరికొందరు వింతగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter