Oreo Biscuit Video: ఓరియో బిస్కెట్ తింటున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఉలిక్కిపడతారు!
Oreo Biscuit Viral Video: ఓరియో బిస్కెట్లు ఇవి చూడడానికే అందంగా తినటానికి చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో రెండు ఫ్లేవర్స్ మిల్క్, చాక్లెట్ ఉంటాయి. దీంతో పిల్లలు తినడానికి ఇష్టపడతారు.. అయితే ఓరియో బిస్కెట్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది దీన్ని చూస్తే మీరే బిత్తర పోతారు.
Oreo Biscuit Viral Video: ఓరియో బిస్కెట్ ఉదయం లేదా సాయంత్రం స్నాక్ రూపంలో బిస్కెట్లను పిల్లలు తింటారు. ఈ బిస్కెట్లు తినడానికి రుచికరంగా కూడా ఉంటాయి. రెండు ఫ్లేవర్లలో అందుబాటులో ఓరియో బిస్కెట్లు ఉంటుంది. ఒకటి మిల్క్ ఫ్లేవర్ అయితే మరొకటి చాక్లెట్ ఫ్లేవర్. ఈ బిస్కెట్ యాడ్ కూడా విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది ఇలా ఉండగా ఈ ఓరియో బిస్కెట్లలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఈ బిస్కెట్ను ఎక్కువసేపు కాల్చారు. అయినా ఇది కాలిపోదు.. దాదాపు 30 సెకండ్ల పాటు కాల్చినా ఓరియో బిస్కెట్ మాత్రం కాలదు. అయితే ఇలాంటి బిస్కెట్లు తినటం మంచిదేనా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.. వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు ఏంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అని ఆశ్చర్యపోతున్నారు. ఒక చెక్క ఫ్రేమ్ మీద ఓరియో బిస్కెట్లు పెట్టి కాల్చారు. అయితే చెక్క ఫ్రేమ్ కాలింది కానీ బిస్కెట్ మాత్రం కాలలేదు. దీంతో ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. పిల్లలు ఇష్టంగా తినే ఈ ఓరియో బిస్కెట్ ఇలా కాలిపోలేదు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఇది పాలతో తయారుచేస్తారు. మంట కంటే పాలే ఎక్కువ బలంగా ఉంటాయా? అని ఎక్స్ వేధికగా ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇందులో చక్కెర, అన్ బ్లీచ్ చేసిన పిండి అంటే గోధుమ పిండి, నియాసిన్, ఐరన్, మోనో మోనిట్రేట్ తియమిన్, రైబోఫ్లెవిన్, కార్న్ ఆయిల్, సోయాబీన్ కోకోవా, కేనోలో ఆయిల్ వంటి ఉపయోగించి తయారు చేస్తారు.. ఇంకా ఇందులో కార్న్ సిరప్, బేకింగ్ సోడా, ఉప్పు, సోయా లేసితిన్, చాకోలెట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కలిపి తయారుచేస్తారు. ఇక చాలామందిని ఓరియో కుకీలను కాలుస్తూ టెస్ట్ చేస్తున్నారు. ఓరియో బిస్కెట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కొంతమంది మా పిల్లలకు ఈ బిస్కెట్లు పెట్టం అని పోస్టులు పెడుతున్నారు.
ఇదీ చదవండి: శ్రీతేజ్ భవిష్యత్తుకు అల్లు అర్జున్ రూ.2 కోట్లతో ట్రస్టు ఏర్పాటు.. ఇది నిజమా?
సోషల్ మీడియాలో పెట్టే ఏ పోస్టులు అయినా నెట్టింటా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలను ఆసక్తిగా చూస్తుంటారు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన పోస్టులు మరీ ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలిచే వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇందులో ఎక్కువ శాతం అవగాహన కల్పించేవే ఉంటాయి. పాముల వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఏ కొత్త ప్రయోగాలు చేసినా అవి నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తాయి.
ఇదీ చదవండి: ఘనంగా పీవీ సింధు పెళ్లి.. ఉదయ్‌పూర్ వేదికగా వెంకట దత్తతో ఏడడుగులు..గెస్టులు ఎవరొచ్చారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.