Allu Arjun Trust: శ్రీతేజ్‌ భవిష్యత్తుకు అల్లు అర్జున్‌ రూ.2 కోట్లతో ట్రస్టు ఏర్పాటు.. ఇది నిజమా?

Allu Arjun Trust On Sritej: సంధ్య థియేటర్‌ ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్‌ భవిష్యత్తు కోసం అల్లు అర్జున్‌ ఓ నిర్ణయం తీసుకున్నారని నెట్టింట వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా శ్రీతేజ్‌ పేరిట బన్నీ రూ.2 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేయబోతున్నట్లు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Dec 23, 2024, 08:45 AM IST
Allu Arjun Trust: శ్రీతేజ్‌ భవిష్యత్తుకు అల్లు అర్జున్‌ రూ.2 కోట్లతో ట్రస్టు ఏర్పాటు.. ఇది నిజమా?

Allu Arjun Trust On Sritej: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో చినిపోయిన రేవతి కొడుకు శ్రీతేజ్‌ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలె అతని మెడికల్‌ బులెటిన్‌ కూడా వైద్యులు విడుదల చేశారు. కళ్లు తెరిచాడు కానీ ఎవరినీ గుర్తు పట్టడం లేదు. వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతుంది. ఆహారం కూడా ఇస్తున్నాం అన్నారు. అయితే, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీతేజ్‌ వైద్యానికి సహాయం అందించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అల్లు అర్జున్‌ తీరుపై మండి పడ్డారు. సంధ్య థియేటర్‌ ఘటనను ఆయన వివరించారు. అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి వచ్చిన వారిపై కూడా సీఎం ధ్వజమెత్తారు.శ్రీతేజ్‌ను పరామర్శిచడానికి సినీ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ రాలేదు. ఆ హీరోకు ఏమైంది? అని పరామర్శించడానికి వెళ్లారు అన్నారు. అయితే, తాజాగా పోలీసులు సంధ్య థియేటర్‌ ఘటనకు సంబంధించి  ఓ లెటెస్ట్‌ మినట్‌ టూ మినట్‌ వీడియోను విడుదల చేశారు. 

ఇదీ చదవండి: ఘనంగా పీవీ సింధు పెళ్లి.. ఉదయ్‌పూర్ వేదికగా వెంకట దత్తతో ఏడడుగులు..గెస్టులు ఎవరొచ్చారంటే..?  
అయితే, తాజాగా నెట్టింట అల్లు అర్జున్‌కు సంబంధించిన మరో వార్త హల్ చల్‌ చేస్తోంది. సంధ్య థియేటర్‌ ఘటనతో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్‌ వైద్య, భవిష్యత్తుకు అల్లు అర్జున్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారట. శ్రీతేజ్‌ పేరిట రూ.2 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తున్నారట.ఇది అల్లు అర్జున్‌, సుకుమార్‌, మైత్రి మూవీ మేకర్స్‌ కలిసి ఈ ట్రస్ట్‌లో జమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని శ్రీతేజ్‌ వైద్యం, భవిష్యత్తు కోసం వాడనున్నట్లు ప్రణాళిక సిద్ధం చేశారని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే, ఇది ఎంత వరకు నిజము అనేది అధికారికంగా ప్రకటించే వరకు తెలీదు.

నిన్న ఆదివారం అల్లు అర్జున్‌ ఇంటిపై ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ విద్యార్థులు దాడి చేశారు. ఇంటి బాల్కనీలో ఉన్న పూలకుండిని పగులగొట్టారు. గేటు పై నుంచి దూకి ఇంటిపై కూడా రాళ్లు విసిరారు. వెంటనే పిల్లలను అల్లు అర్జున్‌ తన మామ ఇంటికి పంపించిన విజువల్స్‌ కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో సంధ్య థియేటర్‌ ఘటన గురించి వివరించిన పిదప అల్లు అర్జున్‌పై మరింత విమర్శలు పెరిగాయి. ఆ తర్వాత వెంటనే బన్నీ కూడా ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: రేపు ఎల్లుండి భారీ వర్షాలు.. ఈ 3 జిల్లాలకు ఐఎండీ బిగ్‌ అలెర్ట్‌..  

ఇక పుష్ప2 డిసెంబర్‌ 5న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్‌ వేశారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు సంధ్య థియేటర్‌ వద్దకు అల్లు అర్జున్‌ కూడా చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు విడిచింది. ఆమె కొడుకు శ్రీతేజ్‌ ప్రాణాలతో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News