Pets On Trains: ఈ పరిస్థితి ఇకపై ఉండదు. భారతీయ రైల్వే పెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. పెంపుడు జంతువుల్ని తోడుగా తీసుకెళ్లే సౌలభ్యం కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త నిబంధనలు సెట్ చేసింది. ఇక తమ పెంపుడు జంతువులతో రైళ్లో ప్రయాణం చేయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెట్ లవర్స్‌కు ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఇంట్లో ఎంతో మక్కువతో పెంచుకునే పెంపుడు జంతువుల్ని వదిలి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇకపై తోడుగా ప్రయాణం చేయవచ్చు. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లలో పెట్స్ ట్రావెల్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌ను భారతీయ రైల్వే ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త వెసులుబాటు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..


రైళ్లలో పెట్ ట్రావెల్‌కు ఇప్పుడున్న నిబంధనలు


ప్రస్తుతం పెంపుడు జంతువుల యజమానులు తమ పెట్ కోసం పార్సిల్ బుకింగ్ కౌంటర్లో టికెట్స్ తీసుకోవాలి. సెకెండ్ ఏసీ బ్రేక్ వ్యాన్ లేదా లగేజ్ కంపార్ట్‌మెంట్‌తో వాటిని తీసుకెళ్లవచ్చు. జంతువుల బరువు, పరిమాణం ఆధారంగా నిబంధనలున్నాయి. పిల్లులు, జంతువులు ఒకే కోచ్‌లో ప్రయాణం చేయవచ్చు.


పెట్ ట్రావెల్ ఆన్‌లైన్ బుకింగ్ 


ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ రైళ్లలో పెట్స్ ట్రావెల్ కోసం ఆన్‌ లైన్ బుకింగ్ ప్రారంభిస్తోంది. దీనిప్రకారం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ ద్వారా పిల్లులు, కుక్కలకు టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. దీంతో తమతో పాటు వాటిని తీసుకెళ్లేందుకు అనువుగా ఉంటుంది. అయితే పెట్ ట్రావెల్‌కు కొన్ని నియమ నిబంధనలు తప్పకుండా ఫాలో కావల్సి ఉంటుంది. ఇంతకుమునుపు కుక్కల్ని బాక్స్‌లలో మాత్రమే తీసుకెళ్లేందుకు వీలుండేది. దీనికి అదనంగా లగేజ్ రేట్స్ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఎసీ ఛైర్ కార్, స్లీపర్ కార్, సెకండ్ క్లాస్ కోచ్‌లలో అనుమతి ఉండదు.


పెట్స్ యజమానులకు నిబంధనలు


పెట్ యానిమల్స్ టికెట్ బుక్ చేసే సమయానికి తప్పనిసరిగా యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి. ఆ జంతువు బ్రీడ్, రంగు, జెండర్ తెలిపే విధంగా వెటర్నరీ సర్టిఫికేట్ తప్పనిసరి. ప్రయాణ సమయంలో ఆ జంతువుకు అవసరమైన నీళ్లు, ఆహారం అంతా యజమానిదే బాధ్యత, ప్రయాణ సమయంలో ఆ జంతువు గాయపడితే యజమానిదే బాధ్యత. భారతీయ రైల్వే పెట్స్ రవాణాకు రెండు రకాల ఏర్పాట్లు చేసింది. యజమానులు వాటిని తమతో తీసుకెళ్లవచ్చు లేదా లగేజ్ రూపంలో తీసుకెళ్లవచ్చు.


వివిధ పరిమాణాల్లో ఉన్న ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, పిల్లుల్ని తీసుకెళ్లేందుకు నిబంధనలు జారీ చేసింది ఇండియన్ రైల్వేస్. కుక్కలు, పిల్లుల వంటి జంతువుల్ని అదే కోచ్‌లో యజమానులు తమతో తీసుకెళ్లవచ్చు. దీనికి కొన్ని నిబంధనలు తప్పకుండా ఫాలో కావాలి.


Also read: CBSE Results 2023 Viral Memes: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలపై వైరల్ మీమ్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook