ట్విప్లొమసీ జరిపిన తాజా సర్వేలో ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిఉన్న నాయకుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటిస్థానంలో, నరేంద్ర మోడీ మూడవ స్థానంలో నిలిచారు.  ట్విప్లొమసీ తాజా అక్టోబర్ రిపోర్ట్ ప్రకారం, డోనాల్డ్ ట్రంప్ 39,735,749 ఫాలోవర్స్ తో మొదటి స్థానం, పొప్ ప్రాన్సిస్ 39,526,509  ఫాలోవర్స్ తో రెండవ స్థానం, నరేంద్రమోదీ 34,878,753 ఫాలోవర్స్ తో మూడవ స్థానంలో నిలిచారు. ట్విప్లొమసీ అనేది ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ సంస్థల ట్విటర్ వినియోగాన్ని ట్రాక్ చేసే ఒక బర్సన్ మార్స్టెల్లెర్ పరిశోధన ప్రాజెక్ట్. ఎవరికెంత మంది ఫాలోవర్స్ ఉన్నారో గుణాంకాలతో సహా రికార్డు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం. దీనికి అనుగుణంగా తాజాగా  సర్వే నిర్వహించి ఎవరికెంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తేల్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మహిళా విభాగంలో సుష్మా ఫస్ట్...


ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మహిళగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 9,616,129 ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలిచారు. భారత పీఎంవో  కార్యాలయం కూడా టాప్-10 లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. పీఎంవో కార్యాలయం 21,290,170 ఫాలోవర్స్ తో నాల్గవ స్థానంలో ఉంది.