Poverty Hindering Education: పేదరికం ఆ కుటుంబ పాలిట శాపమైంది. సరస్వతీ దేవి అనుగ్రహం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేక ఆ పేద కుటుంబం విలవిలలాడుతోంది. తమ కుమార్తెలను ఉన్నత చదువు చదివించాలన్న కోరిక ఉన్నా.. అది నెరవేర్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడా తండ్రి. నీట్‌లో ర్యాంక్ తెచ్చుకున్న కుమార్తెను కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లలేని దుస్థితి అతడిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండకు చెందిన ధర్మయ్యకు ఇద్దరు కుమార్తెలు. సుతారి పని చూస్తే తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నాడు. కుమార్తెలు ఇద్దరూ చిన్నతనం నుంచి చదువులో రాణిస్తున్నారు. చిన్న కుమారై పావని 2021 సెప్టెంబర్ నెలలో నీట్ లో ఎంట్రెన్స్ పరీక్ష రాసి 720 మార్కులకు గాను 446 మార్కులు సాధించింది. అల్ ఇండియా క్యాటగిరిలో లక్షా 37 వేల 328, ర్యాంకు పొందింది. అల్ ఇండియా కేటగిరీలో 3822 ర్యాంకు, రాష్ట్రంలో నీట్ ఎస్సీ కేటగిరి లో 321 ర్యాంకు సాధించింది.


అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈనెల 16న కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సి ఉన్నా..వెళ్లలేని మానలేని పరిస్థితి వారిది. డాక్టర్ చదవు లక్షలతో ముడిపడిన వ్యవహారం. ఐదు సంవత్సరాల కోర్సుకు పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియడంతో పావని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని  పావని వేడుకుంటోంది. 


Also Read: India vs Sri Lanka 2nd Test: ముగిసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్...టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం..


Also Read: Polavaram Project: పోలవరంలో కీలక ఘట్టం.. ప్రాజెక్టు గేట్లు అమరిక పూర్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo