Dangerous Indigo Snake Eating Big Python: పాములు వాటి పిల్లల్ని అవే తింటుంటాయనే విషయం తెలిసిందే. అయితే, ఆడ పాములు తన పిల్లల్ని అదే తింటే.. మగ పాము మాత్రం మరో మగ పామును తింటుందట. స్నేక్ సైన్స్ గురించి అధ్యయనం చేసే వాళ్లు చెప్పే మాట ఇది. ఒక పెద్ద పాము మరో చిన్న పాము తినడం వంటి దృశ్యాలను మీరు కూడా ఇంటర్నెట్ లో ఏదో ఓ చోట చూసే ఉంటారు. కానీ ఇప్పుడు మేం మీకు చూపించబోయే ఈ వీడియో మాత్రం జస్ట్ షాక్ అయిపోయి నిలబడి చూస్తూ ఉండిపోవాల్సిందే.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక పెద్ద పాము తన కంటే చిన్న పామును తినడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఒక పెద్ద పాము తన సైజ్ పామును తినడం చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సాధారణంగా పాముల్లో కింగ్ కోబ్రా తరువాత మళ్లీ అంతటి భయంకరమైన పాముగా కొండచిలువకు పేరుంది. పెద్ద కొండచిలువను చూస్తేనే ప్యాంట్ తడిసిపోయే వాళ్లు కూడా ఉంటారు. కానీ అలాంటి కొండచిలువను తెలివిగా వెనకాలే వెళ్లి దొంగ దెబ్బ తీసి చటుక్కున నోట కర్చుకున్న మరో పెద్ద పాము.. ఆ కొండచిలువను ఊపిరాడకుండా చేసి తినేసింది.


కొండచిలువ తమ ఆహారాన్ని వేటాడేటప్పుడు తన శత్రువుని చుట్టూరా చుట్టి ఊపిరాడకుండా చేస్తుంది. ఇక ఆ జీవికి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా చేస్తుంది. అలా తాను వేటాడి పట్టుకున్న జీవి తన చేతుల్లోంచి తప్పించుకునేందుకు ఆస్కారం లేకుండా చేసి చంపుకు తింటుంది. అయితే ఇక్కడ ఈ నల్ల పాము తనని నోట కరుచుకుని మింగే ప్రయత్నం చేసినప్పుడు కూడా అదే తరహాలో ఆ నల్ల పామును ఈ కొండచిలువ చుట్టూ అల్లుకుని ఓడించే ప్రయత్నం చేసినప్పటికీ.. రెండూ పాములే కావడంతో కొండచిలువ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మొత్తానికి అంత పెద్ద కొండ చిలువను ఈ నల్ల పాము కొద్దికొద్దిగా మింగేసింది. 



ఇక్కడ టెక్నికల్‌గా జరిగింది ఏంటంటే.. ఈ నల్ల పామును ఇండిగో స్నేక్ అంటారు. దీనికి వేరే పాముల విషాన్ని తట్టుకునే కేపాసిటీ ఉంటుంది. అలా కొండచిలువను తినగలిగింది. ఇక కొండచిలువను వేటాడే క్రమంలో దానిని గట్టిగా నోట కరుచుకుని పట్టుకోవడం వల్ల కొండచిలువకు ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో దానికి శ్వాస తీసుకునే అవకాశం లేక అక్కడే అది తిరిగి పోరాడే శక్తిని కోల్పోయింది. ఆ టెక్నిక్ కారణంగానే అంత పెద్ద కొండచిలువపై కూడా ఈ ఇండిగో స్నేక్ పైచేయి సాధించిందన్నమాట. Ojatro అనే యూట్యూబ్ చానెల్ అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు 28 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ వీడియో వ్యూయర్స్‌ని ఎంతగా స్టన్ అయ్యేలా చేసిందో ఊహించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook