Wine Car: ఆ కారు వైన్ తాగితేనే ముందుకెళ్తోందిట..నిజమేనా
Wine Car: వైన్, విస్కీ, ఛీజ్ మీరేనా తీసుకునేది..నేను కూడా తీసుకుంటానంటోంది ఆ కారు. అసలు వైన్ తాగకపోతే ముందుకే కదలదంట. ఆశ్యర్యంగా ఉందా. ఆ యువరాజు చెప్పాడు కదా నిజమే మరి. మందు తాగితే గానీ ముందుకు కదలని ఆ కారు గురించి తెలుసుకుందాం.
Wine Car: వైన్, విస్కీ, ఛీజ్ మీరేనా తీసుకునేది..నేను కూడా తీసుకుంటానంటోంది ఆ కారు. అసలు వైన్ తాగకపోతే ముందుకే కదలదంట. ఆశ్యర్యంగా ఉందా. ఆ యువరాజు చెప్పాడు కదా నిజమే మరి. మందు తాగితే గానీ ముందుకు కదలని ఆ కారు గురించి తెలుసుకుందాం.
ఇప్పటి వరకూ వాహనాలకు ఇంధనంగా డీజిల్ లేదా పెట్రోల్ లేదా సీఎన్‌జీ గ్యాస్(CNG Gas).ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ కార్ల శకం నడుస్తోంది. పెట్రోల్-డీజిల్ లకు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ గ్యాస్ వస్తే..ఈ మూడింటికీ ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లు(Electric Cars)ప్రారంభమయ్యాయి. వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని వివిధ దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే బ్రిటీష్ రాజవంశానికి కాబోయే చక్రవర్తి ప్రిన్స్ ఛార్లెస్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పెట్రోల్-డీజిల్-సీఎన్‌జీ-ఎలక్ట్రిక్ బదులు.. వైన్‌తో కారు నడిపిస్తున్నారు. ఆశ్యర్యంగా ఉండి నమ్మలేకపోతున్నారా..నిజమే మరి.
ప్రిన్స్ ఛార్లెస్(Prince Charles)21వ పుట్టినరోజు సందర్భంగా అందుకున్న ఆస్టన్ మార్టిన్ కారుపై(Auston Martin)ఇప్పటికీ మోజు తగ్గలేదు. ఆయన ప్రాంగణంలో ఎన్నికార్లు వచ్చినా ఆస్టన్ మార్టిన్ కారు వన్నె ఏ మాత్రం తగ్గలేదు. అందుకే ఆ కారునే ఎక్కువగా వినియోగిస్తుంటారు ప్రిన్స్ ఛార్లెస్. ఛార్లెస్ కారుని రీ డిజైన్ చేయించారు. ఇంజనీర్ల కృషి ఫలించింది. ఆ కారు ఇప్పుడు ఏకంగా వైన్‌తో నడుస్తోంది. బకింగ్‌హామ్ ప్యాలేస్‌లో మిగిలిపోయిన వైన్‌తో ఈ కారు(Charles car runs with Wine)నడుపుతున్నారు.కొన్ని సందర్భంగాల్లో అయితే విరిగిన పాలను కూడా ఇంధనంగా వాడుతున్నారు. ఈ విషయాల్ని స్వయంగా ప్రిన్స్ ఛార్లెస్ వివరించడం విశేషం. వాతావరణ కాలుష్యంపై ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నా సరే ఛార్లెస్ స్పందించకపోవడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల్ని చెరిపేసేందుకే ప్రిన్స్ ఛార్లెస్ ఈ వైన్ కారును ఎంచుకున్నారు. కర్బన ఉద్గారాల్ని వెదజల్లని వైన్ కారును(Wine Car) ప్రొమోట్ చేసుకుంటున్నారు. వైన్ పోస్తే చాలు ఈ కారు సర్రున దూసుకుపోతోంది.
Also read:Three Head Snake: నెట్టింట మూడు తలలపాము ఫోటో వైరల్...అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి