PUBG mobile app latest updates: PUBG Mobile india తో పాటు మరో 118 ఇతర చైనీస్ మొబైల్ యాప్స్‌పై భారత్‌లో ఇప్పటికీ నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబరు నుండి చైనా మొబైల్ యాప్స్ విషయంలో భారత్ వైఖరిలో మార్పు లేదు. అంతే కాకుండా PUBG Mobile, PUBG మొబైల్ లైట్‌తో సహా బ్యాన్ చేసిన అన్ని Chinese apps విషయంలో భవిష్యుత్తులోనూ కఠినంగానే వ్యవహరిస్తామని భారత్ ఇటీవలే మరోమారు స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశం అభివృద్ధి చేసిన FAUG game జనవరి 26న ప్రారంభించి, 24 గంటల్లోపే మూడు లక్షల డౌన్‌లోడ్‌లను నమోదు చేసిన నేపథ్యంలో, PUBG మొబైల్ ఇండియా మార్కెట్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరోవైపు PUBG మొబైల్ వరల్డ్ వైడ్ యూజర్స్‌ని ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొన్ని కొత్త కొత్త ఫీచర్స్‌ని విడుదల చేస్తూనే ఉంది.


PUBG Mobile ఇటీవలే రూనిక్ పవర్ 1.2 వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ APK వెర్షన్ భారతదేశం మినహా మిగతా అన్నిచోట్లా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నట్టు పబ్జీ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ ట్రైలర్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం రూనిక్ పవర్ గేమర్స్ మరింత ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది.


Also read : PUBG latest updates: భారత్‌లో పబ్జీ వచ్చేదెప్పుడు... పబ్జీ లేటెస్ట్ అప్‌డేట్స్...


క్రాఫ్టన్ ఇంక్ సిఇఒ మాట్లాడుతూ.. 2022 నాటికి కాలిస్టో ప్రోటోకాల్, PUBG mobile sequel వంటివి లాంచ్ చేయడం ద్వారా Indian gaming industry కీలక పాత్ర పోషించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిపారు. తాజాగా అందుతున్న అప్‌డేట్స్ ప్రకారం PUBG లో రూనిక్ పవర్ మాత్రమే కాకుండా, ఫైర్ రూన్ ( Fire Rune ) ఆర్టిక్ రూన్ ( Artic Rune ) కూడా ఉన్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook