PUBG latest updates: పబ్జీ వచ్చేదెప్పుడు ? కేంద్రం ఏం చెబుతోంది ?

PUBG mobile india app launch updates: PUBG మొబైల్ గేమ్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన తర్వాత పబ్‌జి గురించి అనేక పుకార్లు షికార్లు చేశాయి. PUBG lovers కి 2021 న్యూ ఇయర్ కానుకగా కొత్త సంవత్సరం ఆరంభంలోనే పబ్‌జీ అందుబాటులోకి రానున్నట్టు గతేడాది నవంబర్ నెలలోనే PUBG మొబైల్ ఇండియా గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి.

  • Jan 19, 2021, 20:57 PM IST

PUBG lovers కి 2021 న్యూ ఇయర్ కానుకగా కొత్త సంవత్సరం ఆరంభంలోనే పబ్‌జీ అందుబాటులోకి రానున్నట్టు గతేడాది నవంబర్ నెలలోనే PUBG మొబైల్ ఇండియా గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి. కానీ అందులో ఏది వాస్తవం ? ఏది అవాస్తవం ? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉందనే వివరాలు గురించి స్పష్టమైన సమాచారామే ఈ ఫోటో గ్యాలరీ. 

1 /7

PUBG మొబైల్ ఇండియా టెస్టింగ్ కోసం కొన్ని డమ్మీ లింక్‌లను విడుదల చేసింది. కాని వాటి నుండి ఏ రకమైన ప్రయోజనం లేకపోయింది. అదే సమయంలో భారత్‌లో పబ్జీ రీలాంచింగ్‌కి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని కేంద్రం చెప్పడంతో నూతన సంవత్సరం ఆరంభంలో వస్తుందనుకున్న పబ్జీ ఆశలన్నీ అడియాశలయ్యాయి. Photo: PUBG website.

2 /7

భారత్‌లో PUBG mobile app గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పబ్లీ రాక గురించి ఫేక్ కథనాలు రావడం మాత్రం ఆగలేదు. Photo: PUBG / Twitter

3 /7

PUBG mobile india relaunching కి సంబంధించి జనవరి 15 నుండి జనవరి 19 మధ్య ఒక కీలకమైన ప్రకటన వెలువడుతుందని ట్విట్టర్‌లో PUBG మొబైల్ ఇండియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన maxxtern అనే వ్యక్తి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ సమాచారం తప్పు అయితే, తాను తన ట్విట్టర్ ఖాతాను తొలగించుకుంటానని సదరు యూజర్ పేర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే.. PUBG మొబైల్ ఇండియా ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ప్రకటన కూడా ఉత్తుత్తిదేనని తేలింది. దీంతో మ్సాక్స్‌టర్న్ ట్విట్టర్ ఖాతాను తొలగించుకున్నట్టుగా DNA ఓ కథనంలో పేర్కొంది.  Photos : PUBG / Twitter

4 /7

ఇదిలావుంటే, భారత్‌లో ఆటను తిరిగి ప్రారంభించడానికి భారత ప్రభుత్వం నుండి PUBG మొబైల్ ఇండియాకు ఇంకా అనుమతి రాలేదు. అంతేకాకుండా భారత ప్రభుత్వం కానీ లేదా PUBG Mobile india corporation కానీ ఇప్పటివరకు రీలాంచింగ్ గురించి ఎలాటి ప్రకటన విడుదల చేయలేదు.

5 /7

ప్రభుత్వం లేదా PUBG కార్పొరేషన్ నుండి అధికారిక ప్రకటన లేకపోతే, PUBG mobile app relaunch, APK డౌన్‌లోడ్‌లకు సంబంధించిన అన్ని వార్తలు ఫేక్ న్యూస్ అనే అనుకోవాల్సి ఉంటుంది. PUBG మొబైల్ ఇండియా రీలాంచింగ్ గురించి ప్రభుత్వం ఏదైనా అధికారిక ప్రకటన చేసే వరకు సోషల్ మీడియాలో వచ్చే ఏ వార్తా కథనాలను నమ్మకూడదు. Photo: PUBG website

6 /7

DNA ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం, PUBG Mobile india మార్చి 2021న ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 69A కింద నిషేధం అమలులో ఉన్నంత వరకు, PUBG మొబైల్ ఇండియా లాంచింగ్ సాధ్యం పడదు. Photo: PUBG website

7 /7

PUGB ఇండియాలో బ్యాన్ అయినప్పటికీ.. ఇలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. PUBG game lovers సైతం ఎప్పుడెప్పుడు పబ్జీ అందుబాటులోకి వస్తుందా అని వేయి కళ్లతో వేచిచూస్తున్నారు.