Corona Puzzle: కరోనా పజిల్ వదిలిన పుణే పోలీసులు, విషయం తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు
Corona Puzzle: పోలీసులు కరోనా మహమ్మారి తీవ్రరూపం, దాని దుష్ప్రరిణామాలు, జాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో అవగాహన కల్పించేందుకు ఓ ట్వీట్ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. కేవలం మహారాష్ట్ర నుంచే సగానికి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హడలెత్తిస్తోంది.
Corona Puzzle: దేశ వ్యాప్తంగా ఒకరోజులో లక్షన్నర పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతన్నాయి. అందులోనూ కేవలం మహారాష్ట్ర నుంచే సగానికి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హడలెత్తిస్తోంది. ఈ క్రమంలో పుణే పోలీసులు కరోనా మహమ్మారి తీవ్రరూపం, దాని దుష్ప్రరిణామాలు, జాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో అవగాహన కల్పించేందుకు ఓ ట్వీట్ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.
కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించిన ఎమోజీలు, మాస్కు లేని ఎమోజీలు, నగదును సూచించే ఎమోజీలతో ఈ పజిల్‌కు సమాధానమెంటో చెప్పాలని పుణే పోలీసులు తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘సార్ నేను గంట సమయం వెచ్చించినా నాకు దీని సమాధానం తెలియలేదు. కామెంట్లు చదివితే.. మాస్కుల గురించి, కరోనా వైరస్(CoronaVirus) జాగ్రత్తల గురించి అని తెలుసుకున్నానని’ ఓ నెటిజన్ స్పందించాడు. కొందరైతే సార్ వైన్ షాప్‌లు ఎప్పుడు తెరుస్తారని సైతం పోలీసులను అడిగటం గమనార్హం.
Also Read: Covid-19 Deaths: ఎండలకు, కరోనా మరణాలకు ఉన్న లింక్‌పై నిపుణులు తేల్చిన విషయం ఇదే
మరో నెటిజన్ ఆ ఫజిల్ సమాధానం సున్నా అని, మరికొందరు ఏమీ లేదని కామెంట్ చేశారు. మరికొందరు చాలా చక్కటి సందేశాన్ని ప్రజలకు ఇచ్చారని పుణే పోలీసులను ప్రశంసిస్తున్నారు. అందుకు వారికి పుణే పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. సరైన సమాధానం సున్నా అని పుణే పోలీసులు స్పందించారు. దాని వివరణ ఏంటంటే.. ఒకవేళ మీరు మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగారనుకోండి మీకు కచ్చితంగా కోవిడ్19(CoronaVirus) సోకుతుంది. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే చివరికి మీ చేతిలో మిగిలేది ఏమీ ఉండదని, కనుక మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే బయటకు వెళ్లే సమయంలో ఫేస్ మాస్క్ ధరించాలని సూచించారు.
Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి
మీ ఆరోగ్యాన్ని సైతం కాపాడుకోండి సార్, కరోనాతో జాగ్రత్త అని కొందరు నెటిజన్లు పుణే పోలీసులకు మద్దతు తెలిపారు. వారి సేవలను గుర్తిస్తూ నెటిజన్లు చేసిన ట్వీట్లకు మర్యాదపూర్వకంగా స్పందించి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఏం చేసినా కరోనా మహమ్మారి కోసమేనని, కొన్ని రోజులపాటు కోవిడ్19 నిబంధనలు పాటించాలన్నది ఆ పజిల్ సారాంశం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook