Viral Video, Big Anaconda and Python fight for Squirrel: సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచ నలుమూలలో ఏది జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. నెట్టింట నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా జంతువులు, సరీసృపాల మధ్య జరిగే కొన్ని హాస్యాస్పద సంఘటనలతో పాటు భయం పుట్టించే సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ప్రతిఒక్కరికి ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఓ ఉడత కోసం కొండచిలువ, అనకొండలు పోట్లాడుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... భారీ అనకొండ, కొండచిలువలు ఒకే వద్ద ఉంటాయి. అవి రెండు ఓ జూలో ఉన్నట్టు తెలుస్తోంది. వాటికోసం ప్రత్యేకంగా ఓ స్థలం ఉంచారు. చుట్టూ ఇనుప తీగలతో వలలా కట్టారు. అందులో రెండు పాముల కోసం టబ్‌లో నీటిని ఉంచారు. ఆ టబ్‌పై చనిపోయిన ఉడతను ఉంచారు. ఉడతను చూసిన అనకొండ, కొండచిలువలు దూసుకొచ్చాయి. అయితే అనకొండతో పోటీపడలేని కొండచిలువ వెనక్కి తగ్గుతుంది. టబ్‌ వద్దకు వెళ్లిన అనకొండ ఉడతను అమాంతం మింగేసింది. 



ఉడతను అనకొండ అమాంతం మింగేసిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'Reptile Channel' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. నిజానికి ఈ వీడియో మూడేళ్ల కిందదే అయినా.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన అందరూ హడలిపోతున్నారు. 


Also Read: భారత్‌ను సెమీస్‌లో ఆడించాలనే.. ఐసీసీ అలా చేసింది! షాహిద్‌ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు


Also Read: Athulya Ravi: దేవకన్యలా మెరిసిపోతున్న అతుల్య రవి.. ఆ నవ్వుకు కుర్రకారు మతులు ఔట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook