Viral Video, Big Python went to a Restaurant for Dinner with Girls: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు పాములకు దూరంగా ఉండటానికే ఇష్టపడతారు. ఎప్పుడూ పాములను చూడాలని కూడా అనుకోరు. కొందరు ఐటీ కనీసం వాటి పేరు కూడా వినడానికి ఇష్టపడరు. కొందరు వ్యక్తులు మాత్రం పాములతో ఆటాడుకుంటారు. ఎంతలా అంటే పెంపుడు కుక్క మాదిరిగా వాటిని చూసుకుంటారు. పాములను తమతో పాటు బయటికి కూడా తీసుకెళతారు. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిన్నర్ చేయడానికి ఓ కొండచిలువ ఏకంగా రెస్టారెంట్‌కి వెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ ఇద్దరు అమ్మాయిలు డిన్నర్‌ చేసేందుకు రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ అమ్మాయిలు వారితో పాటుగా ఓ భారీ కొండచిలువను కూడా రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. ఇద్దరు అమ్మాయిలు టేబుల్ ముందు కూర్చోగా.. పాము టేబుల్ పైన ఉండి అందరినీ గమనిస్తుంటుంది. అమ్మాయిలిద్దరూ ఫుడ్ ఆర్డర్ చేసి.. వెయిటర్ కోసం ఎదురుచూస్తుంటారు. పాము కూడా ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో ఫుడ్ వస్తుంది. 



ఓ అమ్మాయి చాప్స్ టిక్ సాయంతో ఆహారాన్ని తీసుకొని భారీ కొండచిలువకే తినిపిస్తుంది. అమ్మాయి పెట్టే ఆహారాన్ని ఆ పాము ఎంచక్కా లాగిస్తుంది. ఈ దృశ్యం చూసి రెస్టారెంట్‌లో ఉన్న చాలా మంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పాము మాత్రం రెస్టారెంట్‌లో ఉన్న ఎవరినీ ఏమీ అనదు. ఇందుకు సంబందించిన వీడియోను ఇల్‌హనాటలే (ilhanatalay_) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. మూడు వారాల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకి దాదాపుగా లక్ష వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది. 


Also Read: Amla Hair Care Tips: ఐశ్వర్య రాయ్ లాంటి నలుపు, బలమైన జుట్టు కావాలా.. వారానికి రెండుసార్లు ఇలా చేయండి!  


Also Read: DC Captain: రిషబ్‌ పంత్‌ ఔట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్! కీపర్ ఎవరో తెలుసా  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.