David Warner Likely To Replace Rishabh Pant as Delhi Capitals Captain for IPL 2023: టీమిండియా యువ బ్యాటర్, ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కొత్త సంవత్సరం 2023కి ముందు ఘోర రోడ్డు ప్రమాదంకు గురయిన విషయం తెలిసిందే. తీవ్ర తీవ్రగాయాలపాలైన పంత్.. ప్రస్తుతం ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్ ముఖానికి ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీ కూడా అయింది. పంత్ గాయంపై బీసీసీఐ ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూ ఉంది. పంత్ ఆరోగ్యంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి తాజాగా మాట్లాడారు. యువ బ్యాటర్ మరో 6-9 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని సంకేతాలు ఇచ్చారు.
రిషబ్ పంత్ 9 నెలల పాటు మైదానంలోకి దిగకుంటే.. స్వదేశంలో జరిగే న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లతో పాటు ఐపీఎల్ 2023 కూడా మిస్ అవుతాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (భారత్ క్వాలిఫై అయితే), వెస్టిండీస్ సిరీస్, ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడే అవకాశం లేదు. ఇక నవంబర్ మాసంలో జరిగే వన్డే ప్రపంచకప్ 2023కి కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో పంత్‌కు చాలానే ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ.. ఐపీఎల్‌లో మాత్రం అతని స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం.
రిషబ్ పంత్‌కు ప్రమాదం జరగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తలపట్టుకుంటోంది. కెప్టెన్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలని మల్లగుల్లాలు పడుతోంది. అయితే సీనియర్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం... కెప్టెన్సీ పాత్ర కోసం వార్నర్‌ను సంప్రదించాలని డీసీ యాజమాన్యం భావిస్తోందట. ఇక పంత్ గైర్హాజరీలో సర్ఫరాజ్ ఖాన్ మొత్తం సీజన్‌కు వికెట్ కీపింగ్ చేయనున్నాడట. మిడిలార్డర్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సర్ఫరాజ్‌కు కలిసిరానుంది.
డేవిడ్ వార్నర్ 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2016లో జట్టుకు మొదటి ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. అయితే ఐపీఎల్ 2021 మధ్యలో కెప్టెన్‌గా తొలగించబడ్డాడు. అంతేకాదు ఫ్రాంచైజీ అతనిని కొనసాగించలేదు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022లో కొన్ని మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఢిల్లీలో అనుభవజ్ఞుడైన ప్లేయర్ కూడా దేవ్ భాయ్ మాత్రమే.
Also Read: ICC T20 Rankings: 40 స్థానాలను ఎగబాకిన దీపక్ హుడా.. టాప్ 10లో ఒక్క ఇండియన్ ప్లేయర్ లేడు!
Also Read: Car Discount Offers: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. ఈ మూడు కార్లపై 65 వేల తగ్గింపు! లిమిటెడ్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.